Wednesday, May 1, 2024

‘రైజ్ ఆఫ్ శ్యామ్’ సాంగ్ విడుదల..

- Advertisement -
- Advertisement -

'RISE OF Shyam' Lyrical song released

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ నుంచి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే సినిమా మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రయూనిట్ ఇప్పుడు సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించేసింది. ఇందులో భాగంగా కొద్దిసేపటిక్రితం ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ అంటూ తొలి లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసింది. శ్యామ్ పాత్రకు సంబంధించిన కారెక్టరైజేషన్ గురించి వివరిస్తూ ఈ పాట సాగుతుంది. మిక్కీ జే. మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. భారీ స్థాయిలో వీఎఫెఎక్స్‌తో రాబోతోన్న ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా.. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో డిసెంబర్ 24న విడుదలవుతుంది.

‘RISE OF Shyam’ Lyrical song released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News