Wednesday, May 1, 2024

నన్ను చంపాలని నిర్ణయం తీసుకున్నారా?: రోహిత్ శర్మ

- Advertisement -
- Advertisement -

Rohith Sharma answer on question

 

ఢిల్లీ: ఇప్పటి వరకు అత్యధికంగా ఐదు సార్లు ఐపిఎల్ టైటిల్స్‌ను ముంబయి ఇండియన్స్‌కు రోహిత్ శర్మ అందించాడు. ఇన్ని ట్రోఫీలు గెలవడానికి జట్టు సమిష్టి కృషి అని పొగిడారు. ఈ సీజన్ ఐపిఎల్ తొలి మ్యాచ్‌లో ఆర్‌సిబితో ఓడిపోయిన అనంతరం రెండో మ్యాచ్‌లో కెకెఆర్‌పై విజయం సాధించింది. ముంబయి ఇండియన్స్ ప్రాంచైజీ టీమ్ బాండింగ్ సెషన్ నిర్వహించింది. రెండు నిజాలు, రెండు అబద్ధాలు చెప్పాలని షరతు విధించింది.

ప్రశ్న: నీ భార్య బాగా అబద్ధాలు ఆడుతుందా?
రోహిత్ జవాబు: నా భార్య అబద్ధం చెప్పాలనుకుంటే ఖచ్చితంగా చెబుతుందన్నారు.
ప్రశ్న: నీ భార్య నమ్మదగిన వ్యక్తా? కాదా?
రోహిత్ జవాబు: తడబాటు లేకుండా నా భార్య చాలా నమ్మదగిన వ్యక్తి అని, … ప్రశ్నలతో చంపాలని అనుకుంటున్నారా? అని నవ్వేశారు.
టీమ్ బాండింగ్ చాలా ముఖ్యమైన విషయమన్నారు. ఆటలో దిగుతున్నప్పుడు చాలా ముఖ్యమైన విషయాలు చర్చించుకుంటామన్నారు. ఆటగాళ్లతో ఇంటరాక్షన్ అనేది కీలకమన్నారు. ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్‌తో ముంబయి ఇండియన్స్ తలపడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News