Thursday, May 9, 2024

భారీ పోరాటాలు

- Advertisement -
- Advertisement -

రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు నటిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం మార్చిలో ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని దర్శకుడు రాజమౌళి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. అందుకోసం ఇండోర్‌లో గ్రీన్ మ్యాట్ సెట్‌ను ఏర్పాటు చేశారు. వందల కొద్ది లైట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఎయిర్ ఎఫెక్ట్‌తో ఫైటింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన చిన్న వీడియోను యూనిట్ సభ్యులు షేర్ చేశారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, ఇతర భాష ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News