Saturday, April 27, 2024

కట్టల గుట్ట

- Advertisement -
- Advertisement -

RS 3.75 Cr Seized in Banjara Hills Road Number 12

హైదరాబాద్: కార్లలో తరలిస్తున్న హవాలా డబ్బులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రెండు కార్లలో భారీ ఎత్తున డబ్బులు తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద ఉన్న రూ.3,75,30,000ను స్వాధీని చేసుకున్నారు. డబ్బులు తరలిస్తున్న రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుజరాజ్, పటాన్ జిల్లా, చనాస్‌నా తాలూక, ధర్మోడ గ్రామానికి చెందిన ఈశ్వర్ దిలీప్‌జీ సోలంకి, హరీష్ రామ్ భాయ్ పటేల్ పి. విజయ్ అండ్ కంపెనీలో హైదరాబాద్ బ్రాంచ్ కారు డ్రైవర్లుగా పనిచేస్తున్నాడు.

గుజరాత్, గాంధీనగర్ జిల్లా, పలియాడ్ గ్రామానికి చెందిన అజిత్ సింగ్ ఆర్ దోడియా, రాథోడ్ కనక్ సింగ్ నటూభా విజయ్ కంపెనీలో ఆఫీస్ బాయ్స్‌గా పనిచేస్తున్నాడు. రెండు కార్లలో భారీ ఎత్తున డుబ్బలు తరలిస్తున్నారనే సమాచారం రావడంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రోడ్డు నంబర్ 12, బంజారాహిల్స్‌లోని స్కోడా షోరూం వద్ద కార్లు మహీంద్రా స్కార్పియో, హుందాయ్ యాక్సెంట్ కార్లను ఆపి తనిఖీ చేయగా రూ.3,75,30,000లు కారులో ఉన్నాయి. వాటికి సంబంధించిన లెక్కులు చూపించాల్సిందిగా పోలీసులు కోరడంతో తరలిస్తున్నావారు చూపించలేకపోయారు. డబ్బులు తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా తాము ముంబైకి చెందిన పి. విజయ్ అండ్ కంపెనీలో హైదరాబాద్‌లో పనిచేస్తున్నామని తెలిపారు.

కంపెనీ హైదరాబాద్ ఇన్‌చార్జ్‌లు దినేష్, గిరి నుంచి తీసుకుని తరలిస్తున్నామని తెలిపారు. అజిత్ సింగ్ ఆర్ దోడియా, రాథోడ్ కనక్ సింగ్ నటూభా, మహిళ ఠాకూర్ సోలాబెన్ కుక్‌గా పనిచేస్తోంది. ఈశ్వర్ దిలీప్‌జీ,హరీష్ రామ్ పటేల్ డబ్బులు తీసుకుని సోలాపూర్‌కు వెళ్లేందుకు నగరానికి ఈ నెల 14వ తేదీన వచ్చారు. దినేష్, గిరి వద్ద నుంచి డబ్బులు తీసుకుని రెండు కార్లలో బయలు దేరారు. వారి నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని ఇన్క్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. విచారణలో డబ్బులు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు, దీని వెనుక ఉన్నవాళ్లు విచారణలో తెలుస్తుందిన అన్నారు. టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డి రాధాకిషన్ రావు పర్యవేక్షణలో వెస్ట్‌జోన్ ఇన్స్‌స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్సై రంజీత్‌కుమార్, మల్లికార్జున్, ముజఫర్ తదితరులు నిందితులను పట్టుకున్నారు.

RS 3.75 Cr Seized in Banjara Hills Road Number 12

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News