Monday, April 29, 2024

మసీదులలో ముస్లింలు శ్రీరామ నామం జపించాలి

- Advertisement -
- Advertisement -

ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పిలుపు

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా మసీదులు, దర్గాలు, మదర్సాలలో శ్రీరామ, జైరామ, జైజై రామ అంటూ జపం చేయాలని రాష్టీయ స్వయంసేవక్ సంగ్(ఆర్‌ఎస్‌ఎస్) జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇందేష్ కుమార్ ముస్లింలకు పిలుపునిచ్చారు. ఆదివారం నాడిక్కడ ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత్‌లోని 99 శాతం మంది ముస్లింలు, ఇతర హిందూవేతరులు ఈ దేశానికి చెందినవారేనని, వారు తమ మతాన్ని మార్చుకున్నారు తప్ప తమ దేశాన్ని కాదని అన్నారు. శాంతి సామరస్యం, సహోదరభావం కోసం అయోధ్యలో ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం జరిగే రోజున స్లాం, క్రైస్తవం, సిక్కిజం లేదా మరే ఇతర మతాన్ని పాటించేవారందరూ వారికి సంబంధించిన ప్రార్థనా స్థలాలలో రామనామాన్ని జపించాలని ఆయన కోరారు. రామ మందిర్, రాష్ట్ర మందిర్-రాఉమ్మడి చారిత్రక వారసత్వం పేరిట ఒక పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

మన పూర్వీకులలో సారూప్యత ఉందని, మర రూపురేఖలలో సారూప్యత ఉందని, మన కలలలో సారూప్యత ఉందని ఆయన అన్నారు. మనమంతా ఈ దేశానికి చెందినవారమని, విదేశీయులతో మనకు సంబంధం లేదని ఆయన అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఎంఆర్‌ఎం) ప్రధాన పోషకుడైన కుమార్ మాట్లాడుతూ ఎంఆర్‌ఎం పిలుపునిచ్చిన మేరకు శ్రీరామ జయ రామ, జయజయ రామ అంటూ 11 సార్లు అన్ని మదసీదులు, దర్గాలు, మద్రసాలలో జపించాలని, ఆ తర్వాత మీ పద్ధతిలో ప్రార్థనలు జరుపుకోవాలని ఆయన కోరారు. జనవరి 22న గురుద్వారాలు, చర్చీలు, ఇతన మత ప్రదేశాలన్నిటినీ సుందరంగా అలంకరించి మధ్యాహ్నం 11 నుంచి 2 గంటల వరకు శ్రీరామాలయ ప్రాణప్రతిష్టాపన ఉత్సవాన్ని టీవీలలో వీక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.

అదే రోజు సాయంత్రం హిందువులందరూ తమ ఇళ్లపైన దీపాలు వెలిగించాలని కూడా ఆయన కోరారు. శ్రీరాముడు హిందువులకు మాత్రమే కాదు ప్రపంచంలోని అందరికీ దేవుడంటూ నేషనల్ కాన్ఫరెన్స్ చైర్మన్ ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై కుమార్ మండిపడ్డారు. శ్రీరాముడు హిందువులకే దేవుడని తాము ఎప్పుడు అన్నామని ఆయన ప్రశ్నించారు. రాముడు అందరికీ చెందినవాడని తాను ఉన్న కూటమిలోని ప్రజలకు కూడా అఫరూఖ్ అబ్దుల్లా చెప్పాలని ఆయన సూచించారు. రాముడు అందరికీ చెందినవాడని ప్రతిపక్ష ఇండియా కూటమిలోని వారికి కూడా ఆయన చెప్పాలని కుమార్ అన్నారు. ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎవరికీ ఆహ్వానం అక్కడర్లేదన్న విషనం అబ్దుల్లా గ్రహించాలని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News