Friday, April 26, 2024

కరోనా వ్యాక్సిన్ విడుదల చేసిన రష్యా

- Advertisement -
- Advertisement -

Russia Releases Covid-19 Vaccine

మాస్కో: కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడేందుకు వ్యాక్సిన్ తయారు చేసిన రష్యా దీన్ని రిజిస్టర్ చేసింది. ప్రయోగాల్లో భాగంగా తన కుమార్తై సహా ఇతరులకు ఈ వాక్సిన్ ఇవ్వగా సానుకూల ఫలితాలు వచ్చాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ప్రపంచంలో విడుదలైన తొలి కరోనా వాక్సిన్ తమదేనని పుతిన్ ఈ సందర్భంగా ప్రకటించారు. అటు ఈ వ్యాక్సిన్ ను మొదటగా మెడికల్  సిబ్బంది, టీచర్లకు అందించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కరోనాపై టీకా అభివృద్ధి చేసిన మొదటి దేశంగా రష్యా నిలిచిందని పుతిన్ ప్రకటించారు. మంగళవారం ఆయన నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఈ టీకాకు సంబంధించిన సమాచారాన్ని తనకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుండాలని ఆయన దేశ ఆరోగ్య శాఖ  మంత్రి మిఖాయిల్ మురాషస్కోను ఆదేశించారు.

Russia Releases Covid-19 Vaccine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News