Friday, May 17, 2024

పోరాడలేక సొంత వాహనాలకు నిప్పు!

- Advertisement -
- Advertisement -

Russian soldiers in chaos

రష్యా సైనికుల్లో సన్నగిల్లుతున్న ఆత్మస్థైర్యం
కలవరపరుస్తున్న ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం

కీవ్: ఉక్రెయిన్‌లో పోరాడుతున్న రష్యా సైనికులు గందరగోళంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. దళాల్లో ఎక్కువ మంది యువత ఉన్నారు. వీరికి పూర్తి స్థాయి యుద్ధంలో సరైన శిక్షణ లేకపోవడం, వారిలో ఆత్మస్థైర్యం కూడా తక్కువ కావడం ఆందోళనపరుస్తోంది. వాటికి తోడు ఆహారం, ఇంధనం వంటి వనరుల కొరత కూడా వారిని వేధిస్తున్నాయి. దీంతో యుద్ధం చేయకుండా తప్పించుకోవడం కోసం రష్యన్ సైనికులు తాము ప్రయాణిస్తున్న వాహనాలకు ఉద్దేశపూర్వకంగా పంక్చర్లు చేయడం, యుద్ధ ట్యాంకులకు నిప్పుపెట్టుకోవడం చేస్తున్నారు. ఈ వివరాలను బందీలైన రష్యా సైనికులు చెప్పినట్లు పెంటగాన్ అధికారి అమెరికన్ మీడియాకు తెలిపారు. కనిపించిన ఉక్రెయిన్ పౌరులను కూడా కాల్చి పారేయండని పై నుంచి వచ్చిన ఆదేశాలను కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారని ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం పేర్కొంది. ఇందుకు పెంటగాన్ అధికారి ఒకరు చెప్పిందాన్ని ఉటంకించింది.

రష్యన్ సైనికులు యుద్ధం మానేయడానికి తమ వాహనాలను తామే విధ్వంసం చేసుకుంటున్నారు అని కూడా ఆ వార్తా పత్రిక పేర్కొంది. రష్యా బలగంలో చాలా మంది పిన్న వయస్కులని, వారికి అరకొర శిక్షణే అందిందని, వారు పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా కూడా లేరని పెంటగాన్ అధికారి చెప్పినట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ తెలిపింది. బందీలుగా చిక్కిన రష్యన్ సైనికుల వాంగ్మూలం మేరకే ఆ వార్తా పత్రిక ఈ ప్రకటన చేసింది. కీవ్‌ను చేరుకోడానికి రష్యా కాన్వాయ్ 40 మైళ్లు నెమ్మదిగానే కదులుతూ వస్తోందని కూడా పేర్కొంది. దీనికి కారణం రష్యన్ కమాండర్లు తమ యుద్ధ ప్రణాళికను పునరాలోచించుకుంటుండాలని కూడా న్యూయార్క్ టైమ్స్ రాసింది. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఇంటర్‌సెప్ట్ చేసి రేడియో మెసేజిలను న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఉక్రెయిన్ పట్టణాలపై బాంబులు వేయడానికి రష్యా బలగాలు నిరాకరిస్తున్నాయని డెయిలీ మెయిల్ పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలయినప్పటి నుంచి రికార్డు చేసిన 24 గంటల వాయిస్ రికార్డింగ్‌ను షాడోబ్రేక్ అనే ఇంటెలిజెన్స్ సంస్థ ట్విట్టర్‌లో పెట్టింది. రష్యా యూనిట్లలో సమన్వయం కూడా కొరవడిందని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News