Tuesday, April 30, 2024

 సైనా, శ్రీకాంత్ ఒలింపిక్స్ ఆశలు ఆవిరి!

- Advertisement -
- Advertisement -

Saina srikanth not qualified to olympics

న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వా ల్, కిదాంబి శ్రీకాంత్‌లకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు ఎలాగైనా అర్హత సాధించాలని భావిస్తున్న వీరి ఆశలపై కరో నా వైరస్ నీళ్లు చల్లింది. కరోనా మహమ్మరి విజృంభణ నేపథ్యంలో ఈ నెల 25 నుంచి కౌలాలంపూర్‌లో జరగాల్సిన మలేసియా ఓపెన్ సూపర్ 750 టోర్నీని వాయిదా వేశారు. దీంతో సైనా, శ్రీకాంత్ ఒలింపిక్స్ అర్హత సాధించే అవకాశాలు సన్నగిల్లా యి. ఇంతకు ముందు న్యూఢిల్లీలో జరగాల్సిన ఇండియా ఓపెన్ కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు రెండు టోర్నీలో మిగిలాయి. ఇందులో ఒక టి మలేసియా ఓపెన్ కాగా, మరోకటిది సింగపూ ర్ ఓపెన్. ఈ పరిస్థితుల్లో సైనా, కిదాంబిలు మలేసియా ఓపెన్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ టోర్నీ కూడా వాయిదా పడడంతో వీరికి కోలుకోలేని షాక్ తగిలింది. మలేసియా ఓపెన్‌ను రీషెడ్యూల్ చేసినా ఒలింపిక్స్ అర్హతకు సంబంధించిన విండోలో దాన్ని పరిగణించలేమని ప్రపంచ బ్యా డ్మింటన్ ప్రకటించడంతో సైనా, శ్రీకాంత్‌లకు షా క్ తగిలింది. మరోవైపు సింగపూర్ ఓపెన్‌లో పాల్గొనడం కూడా వీరికి కష్టంగా మారింది. కరోనా విజృంభణ నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం భార త్ నుంచి రాకపోకలపై నిషేధం విధించింది. ఒకవేళ ఎవరైనా భారతీయులు అక్కడికి వెళ్లాలంటే కఠిన ఆంక్షలు ఉన్నాయి. వేరే దేశంలో 14 రోజు లు క్వారంటైన్‌లో ఉండాలని, ఆ తర్వాత సింగపూర్‌లో అడుగు పెట్టాక మరో 21 రోజులు క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సైనా, శ్రీకాంత్‌లు సింగపూర్ ఓపెన్‌లో పాల్గొనడం దాదాపు అసాధ్యంగానే చెప్పొచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News