Sunday, April 28, 2024

కరోనాపై విరుష్క ఉద్యమం

- Advertisement -
- Advertisement -

తమవంతుగా రూ. 2కోట్ల విరాళం,

ఫండ్ రైజింగ్‌కు పిలుపు,

Viruskha recovery funding for corona

ముంబై : కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తుండడంతో చాలా మంది పరిస్థితి దయనీయంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో వారికి అండగా నిలబడేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. విరాట్, అనుష్క శర్మ దంపతులు ఇప్పటికే కరోనా బాధితుల సహాయార్థం రూ. 2 కోట్లు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించగా, ఇప్పుడు ఫండ్ రైజింగ్ కోసం క్యాంపెయిన్ మొదలు పెట్టారు. తాజాగా అనుష్క, విరాట్ కోహ్లిలు తమ ట్విట్టర్ లో వీడియో షేర్ చేస్తూ.. కరోనా రెండో దశ విజృంభణపై దేశం పోరాటం చేస్తుంది. ఈ సమయంలో మా వంతుగా విరాళాలు సేకరించాలని అనుకుంటున్నాం అని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. కరోనాపై దేశం పోరాటం చేస్తుండగా, ఈ పరిస్థితులలో ప్రజల పోరాటం చాలా కష్టంగా ఉంది. మన కోసం వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎంతగానో కష్టపడుతున్నారు. వారికి ఇప్పుడు మనం అండగా ఉండాలి. అందుకే అనుష్క శర్మ , నేను .. కెట్టోతో కలిసి ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ను మొదలు పెడుతున్నాం. మీరిచ్చే ప్రతి రూపాయి ఎంతో ఉపయోగపడుతుంది. మన కుటుంబం కోసం, స్నేహితుల కోసం కలిసి కట్టుగా పని చేద్దాం. కరోనాను జయిద్దాం. స్టే సేఫ్, స్టే హోమ్ అంటూ వీడియో సందేశంలో తెలిపారు విరాట్ దంపతులు. కాగా, కొద్ది రోజుల వరకు ఐపీఎల్ 2021తో బిజీగా ఉన్న విరాట్ కోహ్లీ, ఈ సిరీస్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఇంటికి చేరుకొని కరోనా బాధితుల కోసం సహాయ కార్యక్రమాలు మొదలు పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News