Saturday, April 27, 2024

ఆ వీడియోలు తొలగించండి

- Advertisement -
- Advertisement -

Samantha gets relief from Kukatpally court

వ్యక్తిగత వివరాలు పోస్ట్ చేయకూడదు
నటి సమంత కేసులో మూడు యూట్యూబ్ చానెళ్లు, సిఎల్ రావుకు, అదేవిధంగా
సమంత కూడా వ్యక్తిగత వివరాలు పోస్టు చేయరాదని కూకట్‌పల్లి కోర్టు ఆదేశాలు
నటి సమంతకు కోర్టులో ఊరట, వీడియోలు తొలగించాలని కోర్టు ఆదేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : సినీ నటి సమంతకు కూకట్‌పల్లి కోర్టులో మంగళవారం నాడు ఊరట లభించింది. తనపై దుష్ప్రచారం చేసిన మూడు యూట్యూబ్ ఛానెళ్లపై చర్యలు తీసుకోవాలంటూ సమంత దాఖలు చేసిన పిటిషనపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ వీడియోలు తొలగించాలని యూట్యూబ్ ఛానెళ్లు, సిఎల్ రావుకు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా సమంత వ్యక్తిగత వివరాలు ఎవరూ ప్రసారం చేయకూడని న్యాయస్థానం పేర్కొంది. పోస్టు చేసిన వీడియో లింకులను యూట్యూ బ్ ఛానెళ్లు తొలగించాలని ఆదేశించింది. సమంత కూడా వ్యక్తిగత వివరాలు పోస్టు చేయకూడదని కోర్టు సూచించింది. ఇటీవల నటి సమంత కూకట్‌పల్లి కోర్టులో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైద్యుడు, విశ్లేషకుడు డా. సిఎల్ వెంకట్రావుతో పాటు మరో మూడు యూట్యూబ్ ఛానెళ్లపై పరువునష్టం దావా దాఖలు చేశారు. అక్కినేని నాగచైతన్యతో తన వైవాహిక జీవితంపై సుమన్ టివి, తెలుగు పాపులర్ టివి, టాప్ తెలుగు టీవీ యూట్యూబ్ ఛానెళ్లలో వెంకట్రావు తప్పుడు ప్రచారం చేశారని పిటిషన్‌లో సమంత పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News