Monday, April 29, 2024

50 మిలియన్ల ‘సారంగ దరియా…’

- Advertisement -
- Advertisement -

Saranga Dariya Song who crossed 50 million views

 

నాగచైతన్య, -సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ చిత్రంలోని ‘సారంగ దరియా…’ అనే పాటను ఈ మధ్యనే రిలీజ్ చేసింది యూనిట్. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో నెవర్ బిఫోర్ రికార్డులు నమోదు చేస్తూ దూసుకెళ్తోంది. కొన్ని రోజుల క్రితం సమంత అక్కినేని చేతుల మీదుగా ఆన్‌లైన్‌లో విడుదలైన ఈ పాట.. మరుక్షణం నుంచే దూసుకెళ్లడం మొదలు పెట్టింది. అలా మొదలైన వ్యూయర్‌షిప్.. అంతకంతకూ వేగంగా పెరుగుతూ టాలీవుడు రికార్డులను కొల్లగొడుతూ దూసుకెళ్లింది. టాలీవుడ్‌లో ఫాస్టెస్ట్‌గా 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన సాంగ్‌గా ఇది నిలిచింది. కేవలం 14 రోజుల్లోనే ఈ మార్కును చేరుకొని సత్తా చాటింది ‘సారంగా దరియా…’. ఈ పాటకన్నా ముందు ఒకే ఒక పాట ఉండడం.. అది కూడా సాయిపల్లవిదే కావడం విశేషం. తమిళ్ మూవీ ‘మారీ’లోని ‘రౌడీ బేబీ…’ పాట కేవలం 8 రోజుల్లోనే 50 మిలియన్ల మార్కును క్రాస్ చేసింది. ఆ తర్వాత స్థానాన్ని ‘సారంగ దరియా’ ఆక్రమించింది. ఇక ‘లవ్ స్టోరీ’ చిత్రం ఏప్రిల్ 16న రిలీజ్ కాబోతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News