Monday, May 6, 2024

శశికళ వర్గం కుట్ర పన్నుతోంది

- Advertisement -
- Advertisement -

Sasikala faction is conspiring:AIADMK

 

పోలీసు విభాగానికి అన్నాడిఎంకె ఫిర్యాదు

చెన్నై: తమిళనాడులో శశికళ వర్గానికి వ్యతిరేకంగా అన్నాడిఎంకె మరోసారి పోలీసులను ఆశ్రయించింది. జైలు శిక్ష ముగించుకుని, కరోనా నుంచి కోలుకుని శశికళ సోమవారం బెంగళూరు నుంచి చెన్నైకు వస్తున్నారు. ఆమె పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇప్పటికీ పార్టీపై ఆధిపత్యం తనదే అని ప్రచారం సాగిస్తున్నారు. ఆమె వర్గం కావాలనే రాష్ట్రంలో హింసాకాండకు కుట్ర పన్నుతోందని, ఈ దశలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు కట్టుదిట్టం చేయాల్సి ఉందని అధికార అన్నాడిఎంకె తెలియచేసుకుంది. అయితే కుట్ర ఆరోపణలను శశికళ మేనల్లుడు, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం నేత దినకరన్ ఖండించారు. ఇది తప్పుడు, అవాస్తవిక ప్రచారం అని విమర్శించారు. ఇరు వర్గాల పరస్పర విమర్శల నడుమ పోలీసు విభాగం స్పందించింది.

చట్టవ్యతిరేక చర్యలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.అసెంబ్లీ ఎన్నికల గురించి సమీక్షించుకునేందుకు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం సారధ్యంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. తరువాత పార్టీ నుంచి ఓ ప్రకటన వెలువరించారు. అయితే శశికళ పరిణామాలను ఇందులో ప్రస్తావించలేదు. ఎప్రిల్ లేదా మే లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ విజయానికి అంతా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉందని ఇందులో పిలుపు నిచ్చారు. ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాల్సి ఉందని, ఇదే మన ప్రచార ప్రాతిపదిక అవుతుందని ఇందులో తెలిపారు. శశికళ ప్రభావం గురించి ప్రత్యేకంగా చర్చించేందుకే ఈ సమావేశం ఏర్పాటు అయిందనే వార్తలను పార్టీ ప్రతినిధి, మాజీ మంత్రి వైగయ్‌చెవలన్ తోసిపుచ్చారు. అయితే శాంతిభద్రతల విచ్ఛిన్నానికి శశికళ వర్గం కుట్రపన్నుతోందని, దీనిని అడ్డుకోవాలని తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సి వి షణుగ్మం నిర్థారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News