Monday, April 29, 2024

అద్దె కోసం వచ్చి.. పుస్తెలతాడుతో పరార్

- Advertisement -
- Advertisement -

Police cracked Chain Snatching Case within three hours

మన్సూరాబాద్: ఇంటి అద్దెకోసం వచ్చి మహిళపై దాడి చేసి పుస్తెలతాడు, ఆమె సెల్ ఫోన్ చోరీ చేసిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోంది. వనస్థలిపురం పోలీసుల కధనం ప్రకారం… వనస్థలిపురం గౌతమినగర్ కాలనీ అక్కసరపు ఉమాదేవి (30) ఇంటికి టూలేట్ బోర్డు తగిలించింది. దీంతో శనివారం ఉదయం టూలేట్ చూసి అపరిచితుడు వచ్చి ఇళ్లు చూసుకోని, సాయంత్రం వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఇంటికి మళ్లీ వచ్చిన అపరిచితుడు మొదటి అంతస్తులో ఉండే ఉమాదేవి ఇంట్లోకి వెళ్లాడు. ఫోను ద్వారా డబ్బులు చెల్లిస్తానని తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. గూగుల్ పేలో నవీన్ పేరు వచ్చిందని, గూగుల్ పే పని చేయడంలేదని డబ్బులు చెల్లిస్తానని బయటికి వెళ్తూ ఓక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. ఆమె ప్రతిఘటించింది. దీంతో పదునైన ఆయుధంతో దాడి చేసి ఆమెను గాయపరిచాడు. మెడలోని రెండున్నర తులాల బంగారు గోలుసు తెంచుకొని , ఆమె సెల్ పోన్ లాక్కోన్ని బైకుపై పారిపోయాడు. పోలీసులు ఫిర్యాదు చేయడంతో వనస్థలిపురం ఏసిపి పురుషోత్తం రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సిసి పుటేజిలను పరిశీలించి,కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టారు.

మూడు గంటలల్లో నిందితున్ని పట్టుకున్న రాచకోండ పోలీసులు

చైన్ స్నాచింగ్ కేసును మూడు గంటల్లో ఎల్బీనగర్ సిసిఎస్ పోలీసులు, వనస్థలిపురం పోలీసులు ఛేదించారు. ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎసిపి నిందితుల వివరాలు తెలిపారు. హయత్‌నగర్ కుమ్మరిబస్తీకి చెందిన గడ్డం నవీన్ (30) గ్లాస్ ఫిట్టింగ్ పని చేస్తుంటాడు. హయత్‌నగర్ రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన కాసుల నరేష్ చారి (34) నిందితులు. నవీన్ బిటెక్ చదివి తాగుడుకు బానిసై అప్పులు తీర్చడంలో యూట్యూబ్‌ లో చూసి దోంగతనాలకు పాల్పడుతున్నాడు. నవీన్ దోంగలించిన రెండున్నర తులాల బంగారు గోలుసు అపహరించి నరేష్ చారికి ఇచ్చాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి మూడు గంటలల్లో నిందితులను పట్టుకున్నారు. ఇరువురి నిందితులు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరిలించారు. కేసును చేధించిన పోలీసులను ఎసిపి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News