Saturday, April 27, 2024

హుందాగా జైదేవ్

- Advertisement -
- Advertisement -

Satyadev's first look poster from 'Godfather'

మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్రాజెక్ట్ ‘గాడ్ ఫాదర్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు. అలాగే చాలా మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చిరంజీవి పాత్రను పరిచయం చేస్తూ ఇటీవల విడుదలైన గ్లింప్స్, టీజర్‌లకు అద్భుతమైన స్పందన వచ్చింది. సోమవారం ఈ సినిమాలోని సత్యదేవ్ పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో సత్యదేవ్… జైదేవ్ పాత్రను పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్‌లో రాజకీయ నేతగా చాలా హుందాగా కనిపించారు సత్యదేవ్. ఈ చిత్రంలో నయనతార, పూరి జగన్నాథ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. ‘గాడ్ ఫాదర్’ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదల కానుంది.

Satyadev’s first look poster from ‘Godfather’

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News