Wednesday, May 1, 2024

సత్యేందర్ జైన్ బెయిల్ నవంబర్ 6 వరకు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ కుమార్ జైన్ బెయిల్‌ను సుప్రీం కోర్టు మరోసారి నవంబర్ 6 వరకు పొడిగించింది. రెగ్యులర్ బెయిల్ కోసం జైన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి తీసుకునే సమయంలో ఈ బెయిల్ పొడిగింపు జరిగింది. జైన్ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ బెయిల్‌పై వాదించగా జస్టిస్ ఎఎస్ బొప్పన్న, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని పరిగణన లోకి తీసుకుంది.

ఈ పిటిషన్‌పై నవంబర్ 6న విచారించడానికి జాబితాలో చేర్చాలని ధర్మాసనం సూచించింది. అంతకు ముందు జైన్ మధ్యంతర బెయిల్‌ను సెప్టెంబర్ 25. ఆ తరువాత అక్టోబర్9 వరకు పొడిగించడమైంది. విచారణను పెండింగ్‌లో ఉంచేలా చేయవద్దని ధర్మాసనం ఇదివరకే జైన్‌కు సూచించింది. అంతకు ముందు సుప్రీం కోర్టు మే 26న మధ్యంతర బెయిల్‌ను ఆరు వారాల పాటు వెన్నుముక సర్జరీ కారణంగా మంజూరు చేసింది. ఆ తరువాత సెప్టెంబర్ 12న 25 వరకు పొడిగించింది. మనీలాండరింగ్ కేసులో జైన్ గత మేలో ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News