Monday, April 29, 2024

నవనీత్ కౌర్‌కు ‘సుప్రీం’లో ఊరట

- Advertisement -
- Advertisement -

కులధ్రువీకరణ పత్రం రద్దుపై స్టే

న్యూఢిల్లీ: లోక్‌సభ సభ్యురాలు నవనీత్ కౌర్ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్రలో షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన అమరావతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన నవనీత్ కౌర్ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారంటూ బొంబాయి హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు మంగళవారం స్టే ఇచ్చింది. జూన్ 9వ తేదీన బొంబాయి హైకోర్టు నవనీత్ కౌర్ కుల ధ్రువీకరణ పత్రాన్ని(క్యాస్ట్ సర్టిఫికెట్)ను రద్దు చేస్తూ నకిలీ పత్రాలతో మోసపూరితంగా ఆమె ఈ పత్రాలను పొందారని, ఇందుకు గాను ఆమెకు రూ. 2 లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది.

కాగా, మంగళవారం బొంబాయి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ నవనీత్ కౌర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ వినీత్ శరన్, దినేష్ మహేశ్వరిలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ ప్రతివాదులైన మహారాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కుల పరిశీలన కమిటీ, ఎంపి క్యాస్ట్ సర్టిఫికెట్‌ను సవాలు చేసిన ఆంద్ర విఠోబ అద్సల్‌లకు నోటీసులు జారీచేసింది. దీనిపై తదుపరి విచారణను జులై 27వ తేదీకి విచారణ వాయిదా వేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News