Monday, April 29, 2024

సింగరేణిలో మరో 643 కొత్త క్వార్టర్ల నిర్మాణం

- Advertisement -
- Advertisement -

354 కోట్ల వ్యయంతో 18 నెలల్లో పూర్తి
కాసిపేటః సింగరేణిలో మరో 643 కొత్త క్వార్టర్ల నిర్మాణంకు బోర్డు అనుమతి తెలిపిందని, 354 కోట్ల వ్యయంతో 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేయనున్నట్లు సిఅండ్‌ఎండి ఎన్. శ్రీధర్ తెలిపారు. సిఎం కెసిఆర్ ఆదేశానూసారంగా దశల వారీగా నూతన క్వార్టర్లు నిర్మించడం జరుగుతుందని ఆయన తెలిపారు. 2018 నుండి ఇప్పటి వరకు 1853 కొత్త క్వార్టర్లు నిర్మించినట్లు ఆయన తెలిపారు. 2018 ఫిబ్రవరి 27న శ్రీరాంపూర్‌లో జరిగిన సింగరేణీయుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సింగరేణి వ్యాప్తంగా పాత క్వార్టర్ల స్థానంలో కొత్తవి సౌకర్యవంతమైన క్వార్టర్లను నియమించి సంస్థ ఇస్తుందని ఇచ్చిన హామీ మేరకు రెండో దశ 643 కొత్త క్వార్టర్లు నిర్మించడం జరుగుతుందని ఆయన అన్నారు.

భూపాలపల్లి, కొత్తగూడెం,ఆర్జీ-3 ఏరియా, సత్తుపల్లి, ప్రాంతాల్లో 1853 క్వార్టర్లు నిర్మించడం జరిగిందన్నారు. సింగరేణిలో 43 వేల మంది కార్మికులు ఉండగా 49,919 క్వార్టర్లు ఉన్నాయని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొత్తగా గనులు విస్తరిస్తున్న ప్రాంతంలో, కాలం చెల్లిన క్వార్టర్ల స్థానంలో ఆధునిక డబుల్ బెడ్ రూం క్వార్టర్లు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్పోరేట్ ఏరియాలో 209, రుద్రంపూర్‌లో 353, సత్తుపల్లి ప్రాంతంలో 81 క్వార్టర్లు నిర్మిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
సంక్షేమంలో నెంబర్ వన్ సింగరేణి..
కార్మికుల సంక్షేమానికి దేశంలోనే సింగరేణి నెంబర్ వన్ అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు కార్మికులకు ఉచిత కరెంట్, సొంతింటి నిర్మాణానికి 10 లక్షల రుణంపై వడ్డి చెల్లింపు, కార్మికుల తల్లిదండ్రులకు ఉచిత వైద్యం, కార్మికుల పిల్లలకు ఫీజు రియంబర్స్‌మెంట్, 10 రెట్లు పెంచి చెల్లిస్తున్న మ్యాచింగ్ గ్రాంట్, ప్రతీ ఏటా లాబాల్లో వాటా, వంటి అనేక పథకాలు సింగరేణిలో అమలు అవుతున్నాయని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News