Friday, April 26, 2024

బడికి రెడీ

- Advertisement -
- Advertisement -
Schools in Telangana to not reopen from today
నేటి నుంచి ప్రతక్ష తరగతులు
గురుకులాలు మినహా అన్ని విద్యాసంస్థల్లోనూ కెజి నుంచి పిజి వరకు
తరగతులు షురూ ఆన్‌లైన్ బోధనపై ప్రైవేటు సంస్థలకు
స్వేచ్ఛ హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విధిగా హాజరుకావాలని విద్యార్థులను బలవంత పెట్టొద్దు : విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గురుకులాలు మినహా మిగతా పాఠశాలలు, కళాశాలలు, వర్శిటీలు బుధవారం నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. మంగళవారం హైకోర్టు ఇచ్చిన మ ధ్యంతర ఉత్తర్వులపై అడ్వకేట్ జనరల్‌తో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు చ ర్చించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సవరణ లు చేస్తూ బుధవారం నుంచే తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం గురుకు ల విద్యాలయాలు మినహాయించి రాష్ట్రంలోని అన్ని పా ఠశాలల్లో కెజి నుంచి పిజి వరకు, అంగన్‌వాడీ మొదలు అన్ని పాఠశాలల్లో గతంలో నిర్ణయించిన మాదిరిగానే సె ప్టెంబర్ 1 నుంచే ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని నిర్ణయించారు. గురుకులాల్లో మాత్రం హైకోర్టుఆదేశాలకు అనుగుణంగా నిర్ణయాన్ని వాయిదా వేశారు.

ప్రత్యక్ష తరగతులకు కచ్చితంగా హాజరు కావాలని విద్యార్థులను బలవంతపెట్టొద్దని ఆదేశిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తిగా ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలా? లేక ఆన్‌లైన్‌లో కొనసాగించాలా? అనే విషయంలో స్వేచ్ఛ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పాఠశాలకు విద్యార్థులను పంపించాలి, కానీ అక్కడ ఏమై నా జరిగితే తమ బాధ్యత కాదని కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యా లు తల్లిదండ్రుల నుంచి ఒప్పంద పత్రాలు తీసుకుంటున్న నేపథ్యంలో దాని పై కూడా విద్యాశాఖ అధికారులు చర్చించారు. అలాంటి పత్రాలకు ఎలాం టి చట్టబద్ధత ఉండదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రత్యక్ష బోధన నిర్వహించే విద్యాసంస్థలు ఎలాంటి నిబంధనలు అనుసరించాలనే దాని పై వారం రోజుల్లో పూర్తి స్థాయి విధివిధానాలు ఖరారు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. పాఠశాలల్లో పాటించాల్సిన కొవిడ్ నిబంధనలపై గతంలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఆన్‌లైన్ పాఠాల కొనసాగింపుపై స్పష్టత కరువు

రాష్ట్రంలో పూర్తిగా ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలా..? లేక ఆన్‌లైన్‌లో కొనసాగించాలా..? అనే స్వేచ్ఛ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ఉంటుందని విద్యాశాఖ తెలిపింది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులకు వెళ్లేందుకు ఇష్టం లేని విద్యార్థులకు దూరదర్శన్, టి సాట్ ద్వారా పాఠాలు కొనసాగుతాయా లేదా అనే విషయంపై విద్యాశాఖ స్పష్టతనివ్వలేదు. ప్రత్యక్ష తరగతులు నిర్వహించే విద్యా సంస్థలు అనుసరించాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలు రూపొందించి విస్తృతంగా ప్రచా రం చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

Schools in Telangana to not reopen from today
కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులే..

ఇంటర్, డిగ్రీ, పిజి, ఇంజినీరింగ్ కళాశాలల్లో బుధవారం నుంచి ప్రత్యక్ష బోధన మాత్రమే జరగనుంది. హైకోర్టు ఆదేశాలు పాఠశాలలకు మాత్రమే వర్తిస్తాయి కాబట్టి.. కళాశాలల్లో ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపై గతంలో తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. కొవిడ్ నిబంధన లు పాటిస్తూ యూనివర్సిటీలు, కాలేజీల్లో ప్రత్యక్ష బోధన చేపట్టాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి సూచించారు. విద్యార్థులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించేలా చూడాలని తెలిపారు. తరగతి గదులు, ల్యాబ్‌లు శానిటైజ్ చేసుకోవాలని సూచించారు.

హాజరు కావాలని బలవంతపెట్టొద్దు : మంత్రి సబిత

రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు మినహాయించి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను యథావిధిగా బుధవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాఠశాలల్లో విద్యార్థులు హాజరు తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. విద్యార్థుల హాజరుపై తల్లిదండ్రులను పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేయకూడదని మంత్రి సూచించారు. తరగతులను ప్రత్యక్ష పద్దతిలోగానీ, ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే అవకాశం ప్రైవేట్ యాజమాన్యాలే నిర్ణయించుకోవచ్చని తెలిపారు. విద్యార్థుల నుంచి ఎలాంటి సమ్మతి పత్రానలు కోరవద్దని స్కూల్ మేనేజ్‌మెంట్లను కోరారు. ఇప్పటికే జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని పాఠశాలల నిర్వహణ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News