Sunday, April 28, 2024

రెండవ ఏఎన్‌ఎంలను రెగ్యులర్ చేయాలి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : తెలంగాణ రాష్ట్ర ఏఎన్‌ఎంలను ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో రెండవ ఏఎన్‌ఎంలను రెగ్యులర్ చేయాలని, వారికి ఉద్యోగ భద్రత తదితర సమస్యలను పరిష్కరించాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివ శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీసు ముందు ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి గ్రీనివెన్సులో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న రెండవ ఏఎన్‌ఎంలు వేల సంఖ్యలో ఉన్నారని, తెలంగాణ ఉద్యమం సందర్భంగా, ఎన్నికల సందర్భంగా కెసిఆర్ అనేక హామిలు ఇవ్వడం జరిగిందని, తెలంగాణ వస్తే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు.

దాదాపు 16 సంవత్సరాలుగా వృత్తిపై ఆధార పడి పనిచేస్తున్న ఏఎన్‌ఎంలను రెగ్యులర్ చేయకుండా నూతనంగా ఓట్‌సోర్సింగ్ పద్ధతుల్లో వీరి స్థానంలో ఎంపిహెచ్‌ఏ రాత పరీక్షల ద్వారా తీసుకోవాలని చేస్తున్న ప్రయత్నం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏటిఐయుసి జిల్లా నాయకురాలు పర్వీన్, శ్రీ విద్య యదా భాయ్ పద్మ, హిమ బిందు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News