Sunday, May 12, 2024

ఎఎన్‌ఎంలతో చర్చలు సఫలం

- Advertisement -
- Advertisement -

సమ్మె విరమణకు ఒప్పందం

మన తెలంగాణ/ హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు, ఎఎన్‌ఎంల ప్రతినిధులకు శుక్రవారం జరిగిన చర్చలు ఫలప్రదమైయ్యా యి. ఎఎన్‌ఎంలు తమ సర్వీస్‌ను రెగ్యులరైజ్ చేయడం, వేతనాల స్థిరీకరణ డిమాండ్లతో గత 15వ తేదీ నుంచి సమ్మె నిర్వహిస్తున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సూచనతో ఇప్పటికే పలుమార్లు వారితో చర్చలు జరిపినట్లు డైరెక్టర్ ఆప్ హెల్త్ జి.శ్రీనివాస్‌రావు తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలకు మంచి వేతనాలను చెల్లిస్తూ, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో నిత్యం ప్రజలతో మమేకమవుతూ, వారికి వైద్య సేవలు అందించే ఏఎన్‌ఎంలు సమ్మె చేయడంతో తలెత్తుతున్న ఇబ్బందులను కూడా వారికి వివరించారు.

ఏఎన్‌ఎంల డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, సమ్మె విరమించి విధుల్లో చేరాలని వారికి సూచించా రు. కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంల డిమాండ్ల అమలుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై కమిటీ వేయాలని వారు కోరుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, కమిటీ వేసేందుకు ప్రభుత్వం అం గీకరించింది. కమిటీ వేస్తున్న అంశాన్ని కూడా ఏఎన్‌ఎంలకు వివరిస్తూనే, సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించారని కమిటీ వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నాటి నుంచే సమ్మె విరమిస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 4వ తేదీ నాటికి కమిటీ వేస్తూ ఉత్తర్వులు విడుదల చేయడం జరగుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News