Wednesday, May 1, 2024

సీతాకోకచిలుక హీరో కార్తీక్ కు గాయాలు

- Advertisement -
- Advertisement -

Seethakoka chiluka cinema hero injured

చెన్నై: తమిళ నటుడు, సీతాకోకచిలుక సినిమా హీరో కార్తీక్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇంట్లో వ్యాయామం చేస్తుండగా కిందపడ్డాడు. మెడ భాగంలో బలమైన గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కార్తీక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కార్తీక్ గత కొంత కాలంగా బిపి, శ్వాసకోస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. తెలుగులో గోపాల రావు గారి అబ్బాయి, అన్వేషణ, మగరాయుడు, అభినందన సినిమాల్లో నటించారు. ఓ సినిమాల్లో యాక్టింగ్ చేస్తూనే తమిళనాడులో రాజకీయ పార్టీ పెట్టాడు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అతడు పార్టీని రద్దు చేసుకున్నాడు. కార్తీక్ కుమారుడు గౌతమ్ కార్తీక మణిరత్నం దర్శకత్వంలో కడలి సినిమాలో నటించారు. ఈ సినిమా హిట్ కాకపోవడంతో టాలీవుడ్‌లో కనిపించకుండా పోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News