Monday, April 29, 2024

వృద్ధులకు రైల్వేఛార్జీల్లో మళ్లీ రాయితీలు కల్పించాలి

- Advertisement -
- Advertisement -

Senior citizens should be given concessions in railway fares again

కేంద్రానికి డిఎంకె ఎంపి కనిమోళి వినతి

న్యూఢిల్లీ : కరోనా కారణంగా 2020 మార్చిలో లాక్‌డౌన్ విధించినప్పుడు రైలు ఛార్జీల్లో వయోవృద్ధులకు, దివ్యాంగులకు రాయితీలు ఎత్తివేశారని, ఇప్పుడు మళ్లీ వాటిని కల్పించాలని డిఎంకె ఎంపి కనిమోళి బుధవారం కేంద్రప్రభుత్వాన్ని అభ్యర్థించారు. బుధవారం ఉదయం రాజ్యసభ సమావేశాల సందర్భంగా ఆమె ఈ అంశాన్ని లేవనెత్తారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులతోపాటు పతకాలు పొందిన క్రీడాకారులు, జర్నలిస్టులు, స్వాతంత్య్రయోధులకు తదితర మొత్తం 53 కేటగిరీల్లో రైల్వే రాయితీలు కల్పించడం పరిపాటిగా వస్తోందని, అయితే కరోనా లాక్‌డౌన్ నుంచి ఈ రాయితీలు రద్దు చేయడం వయోవృద్ధులకు దివ్యాంగులకు తలకు మించిన భారం పడుతోందని ఆమె పేర్కొన్నారు.

రద్దయిన రైళ్ల సర్వీసులను నూటికి నూరుశాతం తిరిగి పునరుద్ధరించాలని, స్పెషల్ రైళ్లలో ఛార్జీలు తగ్గించాలని కూడా ఆమె ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ఎంపి అమీ యాజ్నిక్ జీరో అవర్‌లో కేన్సర్ రోగుల సమస్యలను లేవనెత్తారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చి నివేదిక ప్రకారం దేశంలో 2021లో 26.7 మిలియన్ కేన్సర్ రోగులు ఉండగా, 2025 నాటికి 29.8 మిలియన్ వరకు పెరుగుతారని తెలుస్తోందన్నారు. కేన్సర్ ట్రీట్‌మెంట్ సెంటర్లు ఎక్కువగా నగరాల్లోనే ఉన్నందున గ్రామీణ ప్రజలకు ఎక్కువగా ఖర్చు పెట్టవలసి వస్తోందని చెప్పారు. కేన్సర్ చికిత్స కోసం కావలసిన సదుపాయాలు, సామర్థం పెంపునకు ఎక్కువగా ఖర్చు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. వైద్య రంగంలో ద్రవ్యోల్బణం ఉంటోందన్న వాస్తవాన్ని ఏ ఒక్కరూ కాదనలేరని సిపిఐ ఎంపీ సందోష్ కుమార్ పేర్కొన్నారు. వైద్య విధానాలపై తిరిగి సమీక్ష జరగాలని, ఆరోగ్యభద్రతకు ఎక్కువ నిధులు కేటాయించాలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News