Wednesday, May 1, 2024

విద్యాసంస్థలు నడిపితే కఠిన చర్యలు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR

 

హైదరాబాద్: కరోనాపై ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియాలో కరోనా వేగంగా వ్యాపిస్తుండగా ముందు జాగ్రత్తగా చర్యగా ఇండోర్, ఔట్‌డోర్ స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు బంద్ చేయాలని కెసిఆర్ ఆదేశించారు. జూపార్కులు, మ్యూజియంలు, అమ్యూజ్‌మెంట్ పార్కులు బంద్ చేయాలని కోరారు. ర్యాలీలు, ట్రేడ్ ఫెయిర్స్ కల్చరల్ ఈవెంట్లకు అనుమతి లేదన్నారు. అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ రద్దు చేసుకోవాలని సూచించారు. మాల్స్, సూపర్ మార్కెట్లు తెరిచే ఉంటాయని, ఆర్‌టిసి బస్సులు, మెట్రో రైళ్లు, యథాతథంగా నడుస్తాయని వివరించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భయోత్పాతం కలిగించేలా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమన్నారు. కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, ఈ నెల 31 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇస్తున్నామని, ఎవరు విద్యాసంస్థలు నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని కెసిఆర్ హెచ్చరించారు. బోర్డు పరీక్షలు యథాతథంగా జరుగుతాయని, ఇప్పటికే నిర్ణయమైన పెళ్లిళ్లు పరిమితమైన కుటుంబ సభ్యుల మధ్య చేసుకోవచ్చన్నారు. ఈ నెల 31 తరువాత ఫంక్షన్ హాల్స్ బుకింగ్స్ బంద్ చేయాలని ఆదేశించారు.

- Advertisement -
Previous article
Next article

Related Articles

- Advertisement -

Latest News