Friday, May 17, 2024

స్వల్పంగా పెరిగిన సిద్స్‌ ఫార్మ్‌ పాల ధరలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ప్రీమియం డీ2సీ డెయిరీ బ్రాండ్‌, తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిద్స్‌ ఫార్మ్‌, తమ ఏ2 గేదె పాలు, ఏ2 డబుల్‌ టోన్డ్‌ గేదె (బఫెలో) పాల ధరలను స్వల్పంగా పెంచినట్లు వెల్లడించింది. ఈ నూతన ధరలు అరలీటర్‌ పౌచ్‌లకు వర్తిస్తాయి. సవరించిన ధరల ప్రకారం ఏ2 గేదె పాల ధరలు అరలీటర్‌కు 55 రూపాయలు కాగా, ఏ2 డబుల్‌ టోన్డ్‌ గేదె పాల ధర ధర 44 రూపాయలుగా నిలిచింది. ఈ కంపెనీ తమ ఆవుపాలు, స్కిమ్‌ పాల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.

ఏ2 గేదె పాల నాణ్యత భరోసా కోసం అత్యంత కఠినమైన నాణ్యతా పద్ధతులు అనుసరించాల్సి రావడం, గత ఆరు నెలలుగా ముడి పాల సేకరణ ధరలు గణనీయంగా పెరగడంకు తోడు, ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్యకాలంలో పాల దిగుబడి 50%కు పైగా తగ్గే అవకాశాలు ఉండటం, ఉత్పత్తి వ్యయం పెరగడం వంటి కారణాలను పరిగణలోకి తీసుకుని ధరల సవరణ చేసింది.

సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ వినియోగదారుల నమ్మకం, సంతృప్తి ఆవశ్యకతను నొక్కి చెప్పారు. నిజాయితీగా, అత్యున్నత నాణ్యత కలిగిన పాలు, పాలపదార్ధాలను వినియోగదారులకు అందించాల్సి ఉందంటూ, వ్యయం పెరిగినప్పటికీ వీలైనంతగా ఆ భారం తాము మోయడానికి ప్రయత్నించామని, తప్పనిసరి పరిస్ధితిల్లో స్వల్పంగా పెంచాల్సి ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News