Wednesday, May 1, 2024

హలెప్‌కు షాక్

- Advertisement -
- Advertisement -

హలెప్‌కు షాక్
బెర్టెన్స్, జ్వరేవ్ కూడా ఇంటికే, క్వార్టర్స్‌లో నాదల్, స్విటోలినా

Simona Halep out from French Open 2020

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ సిమోనా హలెప్(రుమేనియా) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్(జర్మనీ) కూడా నాలుగో రౌండ్‌లోనే ఓటమి చవిచూశాడు. ఇక, రెండో సీడ్ రఫెల్ నాదల్(స్పెయిన్), మూడో సీడ్ ఎలినా స్విటోలినా(ఉక్రెయిన్) క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఇక శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అనూహ్య ఫలితాలు నమోదయ్యాయి. టైటిల్ ఫేవరెట్‌గా భావించిన హలెప్ క్వార్టర్ ఫైనల్‌కు చేరకుండానే ఓటమి పాలైంది. పోలండ్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్‌తో జరిగిన నాలుగో రౌండ్‌లో హలెప్ కంగుతింది. అసాధారణ ఆటతో చెలరేగిన స్వియాటెక్ 61, 62తో హలెప్‌ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సాధించింది. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన స్వియాటెక్ ఏ దశలోనూ హలెప్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. దూకుడైన ఆటతో అలరించిన స్వియాటెక్ అలవోక విజయంతో ముందంజ వేసింది. మరోవైపు ఐదో సీడ్ కికి బెర్టెన్స్ (డచ్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. ఇటలీకి చెందిన మార్టినా ట్రెవిసన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెర్టెన్స్ పరాజయం పాలైంది. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన మార్టినా 64, 64తో బెర్టెన్స్‌పై సంచలన విజయం సాధించిన క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. కాగా, మూడో స్విటోలినా మాత్రం నాలుగో రౌండ్‌లో విజయం సాధించింది. కరోలైన్ గార్సియాతో జరిగిన మ్యాచ్‌లో స్విటోలినా 61, 63తో జయకేతనం ఎగుర వేసింది.
జ్వరేవ్ ఔట్
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో జ్వరేవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యాడు. ఇటలీ ఆటగాడు జెన్నిక్ సిన్నర్‌తో జరిగిన మ్యాచ్‌లో జ్వరేవ్ కంగుతిన్నాడు. అసాధారణ ఆటను కనబరిచిన జెన్నిక్ 63, 6, 46, 63తో జ్వరేవ్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రఫెల్ నాదల్ విజయం సాధించాడు. తన జోరును కొనసాగించిన నాదల్ అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అమెరికా ఆటగాడు సెబాస్టియన్ కొర్డాతో జరిగిన పోరులో నాదల్ 61, 61, 62తో సునాయాస విజయాన్ని అందుకున్నాడు.

Simona Halep out from French Open 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News