Wednesday, May 1, 2024

‘స్కంద’ చిత్రీకరణ పూర్తి..

- Advertisement -
- Advertisement -

మాస్ మేకర్ బోయపాటి శ్రీను ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేనితో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’ కోసం చేతులు కలిపారు. తన హీరోలను మునుపెన్నడూ చూడని మాస్ గెటప్‌లలో చూపించడంలో పేరున్న బోయపాటి& రామ్‌ని పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో చూపిస్తున్నారు. పోస్టర్లు, ఇతర ప్రమోషనల్ మెటీరియల్‌లో రామ్ మాస్ అవతార్ లో కనిపించారు. ఇదిలాఉండగా మాసీవ్ సెట్‌లో లీడ్ పెయిర్, డ్యాన్సర్‌లపై చివరి పాటను చిత్రీకరించారు. దీంతో స్కంద మూవీ షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫోటోలో రామ్, శ్రీలీల.. దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత శ్రీనివాస చిట్టూరితో కలిసి ఫ్యాన్సీ దుస్తులలో కనిపించారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

టీజర్, టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించగా, ఫస్ట్ సింగిల్ నీ చుట్టు చుట్టు… చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఎస్ థమన్ స్వరపరిచిన ఈ పాట అన్ని మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది. ఈ పాటలో రామ్, శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ‘స్కంద’ విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News