Monday, April 29, 2024

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై ప్రేమోన్మాది కత్తితో దాడి..

- Advertisement -
- Advertisement -

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై ప్రేమోన్మాది కత్తితో దాడి.. 
నిందితుడిని వెంటాడి పట్టుకున్న అపార్ట్‌మెంట్ వాసులు
చికిత్స నిమిత్తం లంగర్‌హౌస్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు
యువతి పరిస్థితి విషమం

మనతెలంగాణ/హైదరాబాద్: ఓ ప్రేమోన్మాది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం నగరంలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…హైదర్‌షా కోట్ విలేజ్ , లక్ష్మినగర్ కాలనీ లోటస్ హిల్స్‌లో ఉంటున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి సుజనపై యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని వైద్య సేవల నిమిత్తం లంగర్‌హౌస్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా దాడిలో గాయపడిన షాలిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. హర్యానా రాష్ట్రానికి చెందిన షారూఖ్ సల్మాన్ నగరంలోని సన్‌సిటీలో ఉంటూ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇద్దరు గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. ఇది ఇలా ఉండగా యువతిపై దాడి చేసి అపార్ట్‌మెంట్ నుంచి పరారవుతున్న ప్రేమోన్మాదిని స్థానిక ప్రజలు, అపార్ట్‌మెంట్ వాసులు వెంటాడి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు గతంలో యువతి స్నేహితుడిగా తేలింది. ఇటీవల కాలంలో తమ కుమార్తెను వేధిస్తున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు షీటీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Software Employee attacked by lover with knife in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News