Friday, May 3, 2024

మార్కెట్లోకి మరింత ఆలస్యంగా స్పుత్నిక్ వి టీకా

- Advertisement -
- Advertisement -

Sputnik V Covid vaccine delayed in market

న్యూఢిల్లీ : స్పుత్నిక్ వి టీకా మార్కెట్లోకి రాడానికి మరింత సమయం పడుతుందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రతినిధి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. టీకాల దిగుమతి, క్వాలిటీ టెస్టింగ్, ఆలస్యం కావడం వల్ల ఈ టీకాలను మార్కెట్లోకి విడుదల చేయడానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం పైలట్ దశలో ఈ టీకాలను కొన్ని నగరాల్లో అందిస్తున్నారు. 28 నగరాలకు ఈ టీకాను అందుబాటు లోకి తేడానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రయత్నిస్తోంది. ఆడినోవైరస్ ద్వారా తయారయ్యే ఈ టీకా రెండు డోసుల్లో తేడా ఉంటుంది. 21 రోజుల వ్యవధిలో ఈ రెండు డోసులను ఇవ్వాల్సి ఉంది. బహుశా రెండు వేర్వేరు డోసులు రాని కారణంగా పంపిణీ ఆలస్యం అవుతున్నట్టు భావిస్తున్నారు. రష్యాకు చెందిన స్పుత్నిక్ వి టీకాలను భారత్‌లో రెడ్డీస్ ల్యాబ్ సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే.

Sputnik V Covid vaccine delayed in market

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News