Home చిన్న సినిమాలు ‘శ్రీకారం’ ట్రైలర్ విడుదల

‘శ్రీకారం’ ట్రైలర్ విడుదల

'Sreekaram' trailer released

 

యంగ్ హీరో శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ’శ్రీకారం’. కిశోర్ బి. డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని 14 రీల్స్ పల్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట్, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి కానుకగా మార్చి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. యువ కథానాయకులు నితిన్, నాని, వరుణ్ తేజ్ చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. రైతు పాత్రలో శర్వానంద్ ఆకట్టుకున్నారు. ప్రియాంక అందం కనువిందు చేస్తోంది. నగరంలో ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసే యువకుడు గ్రామానికి వచ్చి ఎందుకు వ్యవసాయం చేశాడు. అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి, వ్యవసాయం చేయడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు తెలియాలంటే శ్రీకారం చూడాల్సిందే. శర్వానంద్ వ్యవసాయం గురించి చెప్పే సంభాషణలు మెప్పిస్తున్నాయి.