Tuesday, April 30, 2024

రొటీన్‌కు భిన్నంగా ‘శ్రీదేవి సోడా సెంటర్’

- Advertisement -
- Advertisement -

70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సుధీర్‌బాబు, ఆనంది జంటగా పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల చేస్తున్న సందర్భంగా ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, ఇంద్రగంటి మోహన్ కృష్ణ, అనిల్ రావిపూడి, అజయ్ భూపతి, బుచ్చిబాబు, శ్రీరామ్ ఆదిత్య, హర్షవర్ధన్, సుధీర్, రమణ తేజ, నిర్మాతలు అదిశేషగిరి రావు, రాజ్ కందుకూరి, విష్ణు, హీరో కార్తికేయ తదితరులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘శ్రీదేవి సోడా సెంటర్’ మొదటి బిగ్ టికెట్‌ను హీరో సుధీర్ బాబు తల్లిదండ్రులు విడుదల చేయగా అనిల్ రావిపూడి, కార్తికేయ ఫస్ట్ టికెట్‌ను కొనుగోలు చేశారు. చిత్ర దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడు తూ… సుధీర్‌బాబు 12 సినిమాలు చేసిన హీరో అయ్యి ఉండి కూడా నేను చెప్పిన కథ నచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చారు.

ప్రతి సీన్ కూడా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా తీశాము. మా సినిమా ఓటిటిలో చూసే సినిమా కాదు అందరూ ఫ్యామిలీతో వచ్చి థియేటర్స్‌లో మాత్రమే చూడవలసిన సిని మా ఇది. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అని అన్నారు. చిత్ర నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు మాట్లాడుతూ.. రొటీన్‌కు భిన్నంగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఉంటుంది. ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేయగానే బిజినెస్ స్టార్ట్ అయ్యిం ది. ట్రైలర్ విడుదల చేయగానే తెలుగు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలో కూడా బిజినెస్ అయిపోయింది. ఈ సినిమా చాలా బాగా వచ్చిం ది అని తెలిపారు. హీరో సుధీర్‌బాబు మాట్లాడు తూ.. పలాస చిత్రం కంటే శ్రీదేవి సోడా సెంటర్ ఇంకా చాలా బాగుంటుంది. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడుకి సూరిబాబు, శ్రీదేవి జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉండిపోతాయి అని చెప్పారు.

‘Sridevi Soda Center’ movie pre release event

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News