Monday, April 29, 2024

రోడ్డు ప్రమాదం దురదృష్టకరం

- Advertisement -
- Advertisement -

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన
కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం
మంత్రి వి శ్రీనివాస్ గౌడ్

మన తెలంగాణ / మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ గ్రామీణ మండలం అప్పాయిపల్లి సమీపంలో నిన్న సాయంత్రం జరిగిన రో డ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతి క, పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ దుర్ఘటన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, బాధిత కుటుంబాలకు సహకారం అందించేందుకు ముఖ్యమం త్రి సా నుకూలంగా స్పందిస్తూ వారికి అవసరమైన సహకారాన్ని అందించాలని ఆదేశించిన్నట్లు వెల్లడించారు.

స ంఘటన జరిగిన గురువారం రాత్రి 11గంటల ప్రాంతంలో మ ంత్రి మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొ ందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉందయం మంత్రి మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉన్న ప్రమాదంలో చనిపోయిన వారి పార్థీవ దేహాలను సందర్శించి శ్రద్ధాంజలి ఘ టించి వారి కుటుంబాలు ప్రగాఢ సాను భూతిని తెలిపా రు. అనంతరం మంత్రి ఆస్పత్రి ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరమని, బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని అదేవిధంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ అధికారులకు త గిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన్నట్లు తెలిపారు. ఆర్టీసిలో ప్ర యాణం చేయడం సురక్షితమని ప్రజ లు గమనించాలని, ఆటోలు, ప్రైవేట్ వాహానాల్లో పరిమితికి మించి ఎక్కడం, నిర్లక్షంగా వాహనాలు నడపడం వల్ల ఇలాంటి దుర్ఘటనలు జరుతాయన్నారు. ఈ విషయంపై ఆర్‌టిఏ అధికారులు ప్రైవేట్ ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్‌లకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రత్యేకిం చిన్ని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు, మరో ఇద్దరు సాధారణ వ్యక్తులు చనిపోవడం బాధకరమన్నారు.

చనిపోయిన సా ధారణ వ్యక్తుల పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వమే చూ సుకుంటుందని, ఈ విషయంలో వారి కుటుంబాలు ఎలా ంటి బాధపడాల్సిన అవసరం లేదని, చనిపోయిన కుటుం బాల వారికి డబల్ బెడ్రూమ్ ఇ ల్లుతోపాటు, రెసిడెన్షియ ల్ పాఠశాల, కళాశాలలో సీట్లు ఇస్తామని తెలిపారు. ఇక చనిపోయిన ఉద్యోగుల పిల్లల కు తిరిగి ఉద్యోగాలు కల్పిస్తామని, చనిపోయిన కుటుంబాల బాధ్యత ఒక తహాశీల్దార్‌ను ఇన్‌చార్జిగా ఇచ్చి వారి కుటుంబ పోషణకు సౌకర్యాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించిన్నట్లు ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జగరకుండా ఉండేందుకు ఉద్యోగ సంఘ నాయకులు కూడా సహకరించాలని, అదేవిధంగా ఆర్‌టిఏ శాఖ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే వా హనాలను సీజ్ చేయాలని ఈ సంఘటన మొత్తాన్ని ట్రా న్స్‌పోర్ట్ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన్నట్లు మంత్రి వెల్లడించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ రామ్‌కిషన్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News