Thursday, May 16, 2024

ఈ నెల 20లోగా టెన్త్ ఫలితాలు..!

- Advertisement -
- Advertisement -

SSC Exams 2020 Results Soon in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్: ఇంటర్నల్ మార్కుల ఆధారంగా టెన్త్ విద్యార్థులను పాస్ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఫలితాల వెల్లడిపై ప్రభుత్వ పరీక్షల విభాగం దృష్టి పెట్టింది. తమ వద్ద ఉన్న విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను ప్రాసెస్ చేసే ప్రక్రియను ఈ నెల 20వ తేదీ లోగా పూర్తి చేసి ఫలితాలను వెల్లడించేందుకు ఎస్‌ఎస్‌సి బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాలను వెల్లడించేందుకు అవసరమైనఉత్తర్వులను ప్రభుత్వం బుధవారం జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారం పది రోజుల వ్యవధిలో ఫలితాల ప్రక్రియను పూర్తి చేసేలా బోర్డు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఏడాదికి నాలుగు సార్లు నిర్వహించే ఫార్మేటివ్ అసెస్‌మెంట్(ఎఫ్‌ఎ) పరీక్షల మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించనున్నారు. ఏటా 20 శాతం కేటాయించే ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులను ఈ సారి 100 శాతం పరిగణించి గ్రేడ్లు కేటాయిస్తారు.

SSC Exams 2020 Results Soon in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News