Monday, May 6, 2024

రాష్ట్రాల వారీగా కరోనా వివరాలు…..

- Advertisement -
- Advertisement -

State wise corona patient in india

ఢిల్లీ: అమెరికాలో తరువాత భారత్ లో కరోనా వైరస్ వారం రోజుల నుంచి వేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజూ పది వేల కేసులు నమోదు కావడంతో భారతీయులు ఆందోళనకు గురవుతున్నారు. అమెరికా తరువాత సిరీయస్ కేసులు భారత్ లోనే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం భారత్ లో కరోనా కేసుల సంఖ్య 2.75 లక్షలకు చేరుకోగా 7719 మంది మృత్యువాతపడ్డారు.  ప్రస్తుతం ఇండియాలో కరోనా నుంచి 1.34 లక్షల మంది కోలుకోగా వివిధ ఆస్పత్రులో 1.33 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ఒక్క మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 90 వేలకు చేరుకోగా దాదాపుగా 3300 మంది చనిపోయారు. ముంబయిలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఒక్క ముంబయిలోనే కరోనా కేసులు 51 వేలకు పైగా ఉన్నాయి. భారత్ లో ఇలాగే రెండు రోజుల కూడా కరోనా కేసులు పెరిగితే మూడు లక్షలకు చేరుకుంటుంది. దీంతో ప్రపంచంలో  కరోనా కేసుల సంఖ్యలో భారత్ నాలుగో స్థానానికి చేరుకుంటుంది. భారత్ లో కరోనా టెస్టులు పెంచింతే  తొలి స్థానంలో ఉంటుందని వైద్య వర్గాలు భావిస్తున్నాయి.

 

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు
బాధితుల సంఖ్య
చికిత్స పొందుతున్నవారు కోలుకున్నవారు
మృతులు
మహారాష్ట్ర 90,787 44,859 42,639 3,289
తమిళనాడు 34,914 16,282 18,325 307
ఢిల్లీ 29,943 17,712 11,357 874
గుజరాత్ 21,044 5,358 14,373 1,313
ఉత్తర ప్రదేశ్
11,335 4,365 6,669 301
రాజస్థాన్ 11,245 2,662 8,328 255
మధ్య ప్రదేశ్
9,849 2,700 6,729 420
రాష్ట్రాలు గుర్తించిన వారు 9,227 9,227 0 0
పశ్చిమ బెంగాల్ 8,985 4,950 3,620 415
కర్నాటక 5,921 3,248 2,605 66
బిహార్ 5,455 2,652 2,770 33
హర్యానా 5,209 3,357 1,807 45
ఆంధ్రప్రదేశ్ 5,029 2,177 2,775 77
జమ్ము కశ్మీర్ 4,346 2,792 1,506 48
తెలంగాణ 3,920 2,030 1,742 148
ఒడిశా 3,140 996 2,133 11
అస్సాం 3,051 1,946 1,097 5
పంజాబ్ 2,719 497 2,167 55
కేరళ 2,097 1,232 848 17
ఉత్తరాఖండ్ 1,537 762 755 13
ఝార్ఖండ్ 1,416 849 559 8
ఛత్తీష్ గఢ్
1,211 859 347 5
త్రిపుర 866 673 192 1
హిమాచల్ ప్రదేశ్ 437 191 237 6
గోవా
359 292 67 0
ఛండీగఢ్ 327 37 285 5
మణిపూర్ 304 240 64 0
పుదుచ్చేరీ 132 77 55 0
నాగాలాండ్ 128 118 10 0
లడఖ్ 108 57 50 1
మిజోరం 93 92 1 0
అరుణాచల్ ప్రదేశ్
57 55 2 0
మేఘాలయ 43 29 13 1
అండమాన్ నికోబార్ దీవులు 34 1 33 0
దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ 22 20 2 0
సిక్కిం 13 10 3 0
మొత్తం 2,75,303 1,33,404 1,34,165 7,719
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News