Friday, April 26, 2024

లాల్జీ టాండన్ విగ్రహావిష్కరణ

- Advertisement -
- Advertisement -

Statue of Lalji Tandon unveiled by Minister Rajnath Singh

లఖ్నో గురించి క్షుణ్నంగా తెలిసిన వ్యక్తి : రాజ్‌నాథ్‌సింగ్

లఖ్నో: బిజెపి దివంగత నేత లాల్జీటాండన్ కాంస్య విగ్రహాన్ని రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆవిష్కరించారు. బుధవారం టాండన్ మొదటి వర్ధంతి సందర్భంగా లఖ్నోలోని హజ్రత్‌గంజ్‌లో విగ్రహావిష్కరణ గావించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో బిజెపిని అధికారంలోకి తేవడంలో టాండన్‌దే కీలక పాత్ర అని రాజ్‌నాథ్‌సింగ్ కొనియాడారు. లఖ్నో గురించి క్షుణ్నంగా తెలిసిన ఇద్దరు వ్యక్తుల్లో టాండన్ ఒకరని, మరొకరు చరిత్రకారుడైన యోగేశ్ ప్రవీణ్ అని రాజ్‌నాథ్ తెలిపారు. టాండన్‌కు ఎస్‌పి,బిఎస్‌పి,కాంగ్రెస్ నేతలతోనూ మంచి సంబంధాలున్నాయని రాజ్‌నాథ్ తెలిపారు. బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి టాండన్‌ను సోదరుడిగా భావిస్తారని రాజ్‌నాథ్ గుర్తు చేశారు. విగ్రహావిష్కరణకు యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్‌మౌర్య, దినేశ్, లఖ్నో మేయర్ సంయుక్తభాటియా హాజరయ్యారు. రాజ్‌నాథ్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న లఖ్నో నుంచి టాండన్ బిజెపి ఎంపీగా (200914) పని చేశారు. ఆ తర్వాత బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News