Monday, April 29, 2024

మత్తెక్కించే మాటలతో ఛీటింగ్

- Advertisement -
- Advertisement -

Cyber criminals Target on Social Media Accounts

యువకుల నుంచి వృద్ధుల వరకు బాధితులు
సామాజిక మాద్యమాల్లో యాక్టివ్‌గా ఉన్న వారే టార్గెట్
లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న సైబర్ నేరస్థులు
టైంపాస్ కోసం సోషల్ మీడియాలో ఉంటే అంతే

హైదరాబాద్: సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటే వారికి మత్తెక్కించే మాటలు చెబుతూ సైబర్ నేరస్థులు నిలువునా ముంచుతున్నారు. తమ బుట్టలో పడే వారకు వారికి మాయమాటలు చెబుతు తర్వాత నరకం చూపిస్తున్నారు. ఇలా యువకుల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదలండేలేదు. వారి నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు, వీరి బారినపడిన బాధితులు లక్షలాది రూపాయలు ఇచ్చుకుంటున్నారు. అయినా కూడా వారిని వదలకుండా డబ్బుల కోసం మరింత ఒత్తిడి చేయడంతో తట్టుకోలే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. కొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువుపోతుందని చెప్పకుండా ఉంటున్నారు. దీనిని ఆసరాగా తీసుకుంటున్న సైబర్ నేరస్థులు మరింత రెచ్చిపోయి డబ్బుల కోసం వేధిస్తున్నారు. సరదాకు సోషల్ మీడియాలో ఉంటా, ఛాటింగ్ చేస్తాం అంటే సైబర్ నేరస్థులు వెంటపడి వేధించే అవకాశం చాలా ఉంది.

సైబర్ నేరస్థులు చెప్పే మాటలకు నమ్మి వారి వలలో పడితే అంతే సంగతులు, తర్వాత వారు చెప్పినట్లు వినాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా చాలామంది బాధితులు ఉన్నారు, ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన యువతితో తరచూ ఛాటింగ్ చేసేవాడు. ఇద్దరు క్లోజ్ అయ్యాక వాట్సాప్ నంబర్ ఇచ్చుకున్నారు. ప్రతి రోజు రాత్రి ఛాటింగ్ చేసుకునేవారు, నెమ్మదిగా యువతి, యువకుడిని మత్తుమాటలు చెప్పి లైన్‌లో పెట్టింది. దీనికి పడిపోయిన యువకుడు ఆమె చెప్పినట్లు చేశాడు, న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాడు. రెండు, మూడు సార్లు మాట్లాడిన వీడియోలు రికార్డు చేసిన యువతి తర్వాత నుంచి వాటిని చూపించి డబ్బులు ఇవ్వాల్సిందిగా వేధింపులకు గురిచేయడం ప్రారంభించింది. ఎలాగైన ఆమెను వదిలించుకోవాలని మొదట్లో డబ్బులు ఇచ్చాడు, దీనిని ఆసరాగా తీసుకుని మళ్లీ డబ్బుల కోసం వేధించడం ప్రారంభించింది. దీంతో బాధితుడు భరించలేక రాయదుర్గం పోలీసులను ఆశ్రయించాడు.

తాజగా బయటపడిన కేసులో నగరానికి చెందిన వృద్ధుడు సరదా కోసం సోషల్ మీడియాలో తరచూ గుర్తుతెలియని వ్యక్తులతో ఛాటింగ్ చేసేవాడు. ఈ క్రమంలోనే ఓ యువతి వృద్ధుడితో మాయమాటలు, సెక్సియెస్ట్ చాటింగ్ చేసేది. దీంతో వృద్ధుడు ఆమెతో ఛాటింగ్ చేసేవాడు, వీడియో కాల్స్ మాట్లాడేవాడు. ఈ విధంగా గత కొంత కాలం నుంచి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వృద్ధుడిని టార్గెట్ చేసుకున్న సదరు యువతి డబ్బులు అడగడం ప్రారంభించింది. డబ్బులు ఇవ్వకుంటే తన వద్ద ఉన్న అతడి ఛాటింగ్, వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించడం ప్రారంభించింది. బయటపడితే తన పరువు పోతుందని భావించిన వృద్ధుడు పలు దఫాలుగా రూ.11లక్షలు ఇచ్చాడు. అయినా కూడా మళ్లీ డబ్బులు ఇవ్వాల్సిందిగా బ్లాక్‌మెయిల్ చేస్తుండడంతో భరించలేక నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా తక్కువమంది పోలీసులను ఆశ్రయిస్తున్నారు. బయటికి చెప్పని వారు వందల్లో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

సోషల్ మీడియాతో జాగ్రత్త….

సాంకేతిక విప్లవం వల్ల యువకుల నుంచి వృద్ధుల వరకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో సోషల్ మీడియాలో ఉంటున్నారు. ఇందులో గుర్తుతెలియని వ్యక్తులతో స్నేహం చేయడం అసలుకే మోసం వస్తోంది. వారిని నమ్మి వ్యక్తిగత విషయాలు తదితరాలు చెప్పడంతో డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఇలాంటి ముఠాలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వారిని టార్గెట్ చేసుకుని పనిచేస్తున్నారు. వీరు బృందాలుగా ఏర్పడి ప్రతి రోజు బాధితులను వేధించడం, లైన్‌లో పెట్టడం చేస్తున్నారు. సోసల్ మీడియాలో ఉంటే వారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలను పలుమార్లు హెచ్చరిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులకు స్పందించవద్దని, వారికి వ్యక్తిగత వివరాలు ఇవ్వద్దని చెబుతున్నారు. అయినా కూడా చాలామంది సైబర్ నేరస్థుల బారినపడుతున్నారు. వీరి వలకు చిక్కిన బాధితులు లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News