Home తాజా వార్తలు రివెంజ్ డ్రామా

రివెంజ్ డ్రామా

Street light movie like that revenge

మూవీ మాక్స్ బ్యానర్‌పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం ‘స్ట్రీట్ లైట్‘.ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, టీజర్, పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోం ది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 12న దీపావళికి తెలుగు, హిందీ భాషల్లో థియేటర్లలలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ “స్ట్రీట్ లైట్ సినిమా చాలా బాగా వచ్చింది. మాకు ఓటిటి నుండి చాలా ఆఫర్స్ వచ్చాయి.సేవ్ థియేటర్స్ అనే కాన్సెప్ట్‌తో ఓటిటిలో కాకుం డా థియేటర్స్ లో ఈ సినిమాను దీపావళికి తెలుగు, హిందీ రెండు బాషల్లో విడుదల చేస్తున్నాము. ఈ సినిమా ఒక రాత్రి స్ట్రీట్ లైట్ కింద చీకట్లో జరిగే సంఘటనలతో దర్శకుడు ఈ సినిమాను అద్భుతంగా తెర కెక్కించారు”అని అన్నారు. చిత్ర దర్శకుడు విశ్వ మాట్లాడుతూ “రివెంజ్ డ్రామా కథాంశంతో స్ట్రీట్ లైట్ చిత్రం రూపొందించడం జరిగింది. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది”అని తెలిపారు.