Saturday, April 27, 2024

గీత దాటితే వాతే

- Advertisement -
- Advertisement -

Strict decisions of police to control traffic

హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఫైన్లు
స్టాప్‌లైన్ దాటితే రూ.100
ఫ్రీ లెఫ్ట్‌ను క్లోజ్ చేస్తే రూ.1,000 జరిమానా
ట్రాఫిక్ నియంత్రణకు పోలీసుల కఠిన నిర్ణయాలు

మనతెలంగాణ, హైదరాబాద్ : రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు హైదరాబాద్ పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ట్రాఫిక్‌పై కొత్త నిర్ణయాలు తీసుకున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వాటిని ఈ నెల 3వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించనున్నారు. కరోనా తర్వాత నగరంలో భారీగా వాహనాల సంఖ్య పెరగడంతో నిత్యం హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్‌ను తయారు చేశారు. దీనిలో నిబంధనలు చాలామార్పులు చేశారు. పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ జాయంట్ సిపితో పాటు డిసిపిలు, ఎసిపిలు రోడ్లపై ఉండి వాహనాలను నియంత్రించనున్నారు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు కలుగుకుండా ఉండేందుకు చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యంగా రోడ్ల కబ్జా, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు,ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే నగరంలో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని పోలీసుల విచారణలో తేలింది.

వీటిపై ఫోకస్ చేసిన పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. మూడు గోల్డేన్ ఇలు, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోప్‌ను అమలు చేయనున్నారు. వీటిని అమలు చేసి ఏడాదిలోపు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చేయాలనే లక్షాన్ని పెట్టుకున్నారు. అలాగే ఇప్పుడు ఉన్న ట్రాఫిక్ సిబ్బంది సరిపోకపోవడంతో వీరికి అదనంగా 40మంది ఎస్సైలు, 100 మంది హోంగార్డులను నియమించనున్నారు. ప్రతి వారం జాయింట్ సిపి నుంచి హోంగార్డు వరకు రోడ్లపై ఉండి వాహనాలను తనిఖీ చేయనున్నారు. రోడ్లపై ఇష్టవచ్చినట్లు వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నగరంలో ట్రాఫిక్ జాం వీటి వల్లే ఎక్కువగా జరుగుతోంది. దానిని అధిగమించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇలా పార్కింగ్ చేసిన వారికి జరిమానా విధించడమే కాకుండా టోయింగ్ ఫీజు కూడా వసూలు చేయనున్నారు.

ఎడ్యుకేషన్‌పై ఫోకస్…

వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై ముందుగా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఏర్పడే ఇబ్బందులను వివరించనున్నారు. కాలేజీలు, పాఠశాలలు, వ్యాపార సముదాయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆర్టిసి బస్సుల డ్రైవర్లతో సమావేశాలు నిర్వహించి వారు ట్రాఫిక్ నిబంధనలు పాటించడమే కాకుండా బస్సులను బస్‌స్టాప్‌లో నిలిపేలా చర్యలు తీసుకోనున్నారు. షార్ట్ ఫిలీంలు, సైన్‌బోర్డులు, సోషల్ మీడియా ద్వారా కూడా అవగాహన నిర్వహించనున్నారు. టోయింగ్ వాహనాలను రెట్టింపు చేయనున్నారు. ట్రాఫిక్‌కు అడ్డంగా ఉన్న వాహనాలను వెంటనే తొలగించడమే కాకుండా వాహనాలకు జరిమానా విధించడమే కాకుండా టోయింగ్ వాహనాల ఖర్చును కూడా వాహనదారుడికి విధించనున్నారు. బైక్‌కు రూ.200, కారుకు రూ.600 టోయింగ్ వాహన ఛార్జీ విధించనున్నారు.

ఇక కొత్త నిబంధనలు….

ఈ నెల 3వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్న పోలీసులు స్టాప్ లైన్ దాటితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. లైన్ దాటి ముందుకు వచ్చిన వాహనంపై రూ.100 జరిమానా విధిస్తారు, ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేసిన వారిపై రూ.1,000 ఫైన్‌ను విధించనున్నారు. చాలా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులు ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేయడంతో ట్రాఫిక్ జాం ఏర్పడుతోంది. లెఫ్ట్ సైడ్‌కు వెళ్లాల్సిన వాహనాదారులు సిగ్నల్స్ వద్ద నిలిచిపోవాల్సిన పరిస్థితి నెల కొంది. అపోలో జంక్షన్, కేబిఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, నానల్‌నగర్ వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ వాహనాదారులు ఫ్రీ లెఫ్ట్‌ను మొత్తం బ్లాక్ చేస్తున్నారు. దీంతో ఈ సిగ్నల్స్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడుతోంది. ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుని దుకాణాదారులు వస్తువులు పెట్టితే భారీగా జరిమానా విధించనున్నారు. పాదాచారులకు ఆటంకం కలిగిలా వాహనాలను పార్కింగ్ చేస్తే రూ.600 జరిమానా విధించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News