Friday, May 3, 2024

సుకుమార్ అంటే ఫైర్

- Advertisement -
- Advertisement -

Sukumar direction pushpa movie

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ సంచలన విజయం దిశగా అడుగులు వేస్తోంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో అభిమానుల కోలాహలం మధ్య ఈ సినిమా సక్సెస్ పార్టీ జరిగింది. చిత్ర యూనిట్ అందరూ ఇందులో పాల్గొన్నారు. ఈ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం రెండు సంవత్సరాలుగా చిత్తూరు గురించి బాగా తెలుసుకున్నాను. ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు.. వాళ్ళ భాష యాస ఎలా ఉంటుంది… ఇవన్ని నేర్చుకున్నాను. సుకుమార్ అంటే సుకుమారంగా ఉంటారు అనుకుంటిరా… కాదు ఆయన ఫైర్. పుష్ప సినిమాతో ఘన విజయాన్ని అందించిన సుకుమార్‌కు ధన్యవాదులు అని అన్నారు. దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. ‘పుష్ప సినిమా కోసం రెండేళ్లు నాతో పాటు సినిమా టీం అంతా పగలు, రాత్రి నిద్ర లేకుండా కష్టపడ్డారు. కరోనా సమయంలో అడవులోకి వెళ్లి షూట్ చేసాం, దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని తెలిపారు. ఈ వేడుకలో రష్మిక మందన, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News