Wednesday, May 1, 2024

పెళ్లంటే ఎందుకు అలర్జీ?

- Advertisement -
- Advertisement -

Sumanth act in Malli Modalaindi movie

సుమంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. టి.జి.కీర్తి కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని కె. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. శుక్రవారం హీరో సుమంత్ క్యారెక్టర్ రివీలింగ్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో హీరో సుమంత్ లుక్ క్లాస్‌గా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇందులో పెళ్లంటే అసలు ఇష్టంలేని యువకుడిగా ఆయన కనిపిస్తాడు. సుశాంత్‌కు జోడీగా నైనా గంగూలీ నటించింది. ఈ చిత్రంలో సుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్, మంజుల ఘట్టమనేని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో హీరోకి పెళ్లంటే ఎందుకు అలర్జీ అనేది ఆసక్తికరంగా ఉంటుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News