Monday, April 29, 2024

సాహసానికి మారుపేరు కృష్ణ

- Advertisement -
- Advertisement -

Superstar Krishna Birthday Celebrations

సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు వేడుకలు ఆయన చిన్న అల్లుడు హీరో సుధీర్ బాబు ఇంట్లో సింపుల్‌గా జరిగాయి. సుధీర్ నటిస్తున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా థీమ్‌తో రెడీ చేసిన స్పెషల్ కేక్‌ని కృష్ణతో కట్ చేయించారు. ముందుగా సతీమణి ఇందిరకు కేక్ తినిపించారు కృష్ణ. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కృష్ణ బర్త్ డే వేడుకల్లో ఆయన సోదరుడు ఆది శేషగిరిరావు, – సీనియర్ నరేష్ -, పెద్ద అల్లుడు గల్లా జయదేవ్, – రెండో అల్లుడు సంజయ్, – చిన్నల్లుడు సుధీర్ బాబు, – మనవడు గల్లా అశోక్ తదితరులతో పాటుగా కూతుళ్లు, మిగతా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా…

కృష్ణ చిన్న కొడుకు సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన తండ్రికి బర్త్‌డే విషెస్ అందించారు. “హ్యాపీ బర్త్ డే నాన్న. నాకు ఎల్లప్పుడూ ఉన్నతమైన మార్గాన్ని చూపిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను” అని మహేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు తన తండ్రి పుట్టినరోజును పురస్కరించుకుని ఆంధ్ర హాస్పిటల్స్ సహకారంతో బుర్రిపాలెం గ్రామస్తులకు కోవిడ్ -19 టీకాల పూర్తి డ్రైవ్‌ను స్పాన్సర్ చేశారు మహేష్ బాబు.

మల్లెపువ్వు లాంటి మనిషి…

కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని పలువురు అగ్ర సినీ తారలు ఆయనకు బర్త్‌డే విషెష్ తెలియజేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా తనదైన శైలి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. “సాహసానికి మారుపేరు,మల్లెపువ్వు లాంటి మనిషి సూపర్ స్టార్ కృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వారు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే సార్‌” అంటూ తన గౌరవాన్ని చిరు వ్యక్తపరిచారు.

పర్యావరణాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సూపర్ స్టార్ కృష్ణ హైదరాబాద్ నానక్‌రామ్‌గూడాలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ “రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనం పెంచడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. అతను చేస్తున్న కృషికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం మన అందరి బాధ్యత”అని అన్నారు. ఇక తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్‌కి ఈ సందర్భంగా కృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News