Monday, May 6, 2024

అటవీ కేసుల్లో సుప్రీం ఉత్తర్వుల అమలు పర్యవేక్షణకు కేంద్ర సాధికార సమితి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పర్యావరణం, అడవులు, వన్యప్రాణి సంరక్షణ విషయాల్లో సుప్రీం కోర్టు జారీ చేసే ఉత్తర్వుల అమలును పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాధికార సమితిని ఏర్పాటు చేసింది. ఈమేరకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 18న సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ సమితిని ఏర్పాటు చేస్తున్నట్టు ఇందులో పేర్కొంది.

సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు, సూచనలు , సిఫార్సులు చేసి కోర్టు ఉత్తర్వులు , చట్టాలను సమర్ధంగా అమలు చేసే బాధ్యతలను ఈ సమితి నిర్వహిస్తుందని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇందుకు పర్యావరణ , అటవీ, వన్యప్రాణి రంగాల్లో 25 ఏళ్ల అనుభవం ఉన్నవారిని కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో 25 ఏళ్లు పనిచేసిన పరిపాలన అనుభవం ఉన్నవారిని కానీ ఛైర్మన్‌గా నియమిస్తారు. వీరిని కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల కాలానికి నామినేట్ చేస్తుంది.

ఆ గడువును మరో ఏడాదిపాటు పొడిగించడానికి వీలుంటుంది. గరిష్ఠ వయో పరిమితి 66 ఏళ్ల వరకు ఉండొచ్చు. డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్‌గా కానీ, కేంద్ర ప్రభుత్వంలో డైరెక్టర్ హోదాలో కానీ పనిచేసిన వారిని మెంబర్ సెక్రటరీగా నియమిస్తారు. వీరిద్దరు కాకుండా ముగ్గురు నిపుణులను సభ్యులుగా నియమించనున్నారు. ఈ సాధికార సమితి సుప్రీం కోర్టు ఉత్తర్వుల అమలు తీరును పర్యవేక్షించి అందులో ఏమైనా లోపాలుంటే నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందించి తగిన చర్యలు తీసుకోమని సూచిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News