Saturday, May 4, 2024

రెండు ఆర్డినెన్స్‌లను సవాల్ చేసిన సూర్జేవాలా!

- Advertisement -
- Advertisement -

Surjewala

న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ), డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చీఫ్‌లకు ఐదేళ్ల పదవీకాలాన్ని పొడగిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లను కాంగ్రెస్ నాయకుడు రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తన పిటిషన్‌లో ఆయన ‘తాత్కాలిక పొడగింపు’అనేది సుప్రీంకోర్టు రూలింగ్స్‌కు వ్యతిరేకం కాగలదన్నారు. ఈ రెండు ఆర్డినెన్స్‌లు ఆ సంస్థల్లో ఎలాంటి రాజకీయ జ్యోకం జరగకుండా రక్షించేందుకు ఉద్దేశించినవని పేర్కొన్నారు. ఆయన ఈ సందర్భంగా వినీత్ నారాయణ్ కేసులో 1997లో తీసుకున్న నిర్ణయాన్ని ఉటంకించారు. ఆ తర్వాత వచ్చిన అలోక్ కె వర్మ కేసు(2019)ని కూడా ఆయన ప్రస్తావించారు. అంతేకాక సుప్రీంకోర్టు సెప్టెంబర్ 8న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ పదవీ పొడగింపు అన్నది కొన్ని ప్రత్యేక అరుదైన పరిస్థితుల్లోనే చేయాలని ఇచిన తీర్పును కూడా ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు.

“సిబిఐ, ఇడి సంస్థలను ప్రజల సేవ కోసం రూపిందించినవి. కానీ వాటిని సబార్డినేట్‌గా చేస్తున్నారు. అంటే కొందరి అభీష్టానికి అనుకూలంగా అవి పనిచేసేలా చేసుకుంటున్నారు”అని అడ్వొకేట్ అభిషేక్ జేబరాజ్ ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌లో సూర్జేవాలా పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశానికి 15 రోజుల ముందుగానే ఈ ఆర్డినెన్స్ తీసుకురావడంలో కారణం ఏమిటని కూడా ఆయన తన పిటిషన్‌లో ప్రశ్నించారు. ఇలా ‘పీస్‌మీల్ పొడగింపు విధానం’ అనుసరిస్తే అధికారులు ప్రభుత్వ మన్ననల కోసం ఊడిగం చేస్తారని కూడా పేర్కొన్నారు. ఇదిలావుండగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మోహువా మోయిత్ర సైతం ఆ రెండు ఆర్డినెన్స్‌లను సవాలుచేస్తూ బుధవారం పిటిషన్ వేశారు. ఆమె తన పిటిషన్‌లో సుప్రీంకోర్టు తీర్పును కేంద్రం తన ఆర్డినెన్స్‌ల ద్వారా పనికిరానివి చేయకూడదన్నారు. అంతేకాక సంవత్సర కాలం పొడగింపును స్వల్ప కాలిక పొడగింపు అని పేర్కొనడం కూడా సరికాదన్నారు. సిబిఐ, ఇడి డైరెక్టర్ల పదవీకాలం మొత్తంగా చూస్తే రెండేళ్లుగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News