Sunday, May 5, 2024

బంజారాహిల్స్ లో యువతి అనుమానస్పద మృతి

- Advertisement -
- Advertisement -

Suspicious death of young woman in Banjara Hills

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ లో యువతి అనుమానస్పదంగా మృతి చెందింది. నిన్న రాత్రి గదిలో ఐశ్వర్య అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు పెళ్లికి నిరాకరణతో ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పెద్దలకు తెలియకుండా ఐశ్వర్య, అషేర్ గుడిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి విషయం తెలిసి ఇరు కుటుంబాలు జంటను వేరుచేశారు. పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంటానని అషేర్ ఐశ్వర్యకు చెప్పినట్టు సమాచారం. ఇటీవల పెళ్లి చేసుకోవాలని యువతి అషేర్ ను ఒత్తిడి చేసింది. దీంతొ పెళ్లికి అతను ముఖం చాటేశాడు. ఈ నేపథ్యంలోనే యువతి మనస్థాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఐశ్వర్య ఆత్మహత్య కు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నట్టు సమాచారం.

Suspicious death of young woman in Banjara Hills

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News