Monday, May 6, 2024

తైవాన్ పెట్టుబడులకు తెలంగాణ ప్రాధాన్యత ఇస్తుంది: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తైవాన్ పెట్టబడులకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక ఇండస్ట్రియల్ పార్క్‌ను సంయుక్త భాగస్వామ్యంలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. తాయ్ పే, ఎకనమిక్ అండ్ కల్చరల్ సెంటర్ ప్రతినిధుల బృందం బుధవారం మంత్రి కెటిఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలు, టిఎస్…ఐపాస్ లాంటి ప్రభుత్వ విధానాలను తైవాన్ ఎకనమిక్ కల్చరల్ డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్‌కు ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ వివరించారు. ముఖ్యంగా తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇతర ప్రముఖ రంగాలకు సంబంధించి తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను కెటిఆర్ వివరించారు.
తైవాన్‌కు చెందిన ప్రముఖ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు తాను స్వయంగా తైవాన్ లో పర్యటించి తెలంగాణలోని వ్యాపార అనుకూలత గురించి వివరించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ప్రస్తావించారు. రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూలత, ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతుల నేపథ్యంలో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి అనేక రంగాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. తైవాన్,- తెలంగాణ మధ్య పెట్టుబడుల విషయంలో సహకరించాల్సిందిగా డైరెక్టర్ జనరల్ బెన్‌వాంగ్‌ను ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూలత విషయంలో ఉన్న అనేక సానుకూల అంశాలు తనకు తెలుసునని, ఇక్కడ ఉన్న పెట్టుబడి అవకాశాలను తైవాన్ పారిశ్రామిక రంగానికి పరిచయం చేసేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని మంత్రి కెటిఆర్‌కు తైవాన్ ఎకనిమికల్ కల్పచర్ డైరెక్టర్ జనరల్ వాంగ్ హామీ ఇచ్చారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపిస్తున్న ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, పలు ఇతర రంగాల్లోని ప్రముఖ కంపెనీలతో ఒక వర్చువల్ ఇన్వెస్ట్‌మెంట్ సెషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కాగా తైవాన్ ఎకనమిక్ కల్చరల్, తైవాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ డెవలప్‌మెంశ్రీవ కౌన్సిల్, ఇన్వెస్ట్ ఇండియాల సంయుక్త ప్రతినిధి బృందానికి ఐటి శాఖకు చెందిన ఎలక్ట్రానిక్స్, ఇవి డైరక్టర్ సుజయ్ కారంపూరి ఒక ప్రజంటేషన్ ద్వారా తెలంగాణలో ఉన్న వివిధ పెట్టుబడి అవకాశాలపైన వివరాలు అందించారు. ఈ సమావేశంలో ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

Taiwan TECC delegates Meet KTR at Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News