Monday, May 6, 2024

తల్లి చల్లని చూపుతో రాష్ట్రం సుభిక్షం

- Advertisement -
- Advertisement -

గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబికా అమ్మవారికి గురువారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డిలు ప్రభుత్వం తరుపున బంగారు బోన్నం, పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. తెలంగాణ నడి బొడ్డున జగదంబికా అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బోనాల పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడమే కాకుండా ప్రతిఏటా ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

జూలైలో నిర్వహించుకోనున్న సికింద్రాబాద్.. లాల్ దర్వాజ్ హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన చెప్పారు. 2014 నుంచి 2022 వరకు బోనాల వేడుకలకు ప్రభుత్వం రూ.78.15 కోట్లు నిధులను ఖర్చు చేసిందని, ఈ నిధులను ప్రతి ఏటా 3,033 ఆలయాలకు పంపిణీ చేశామని చెప్పారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు ఈ ఏడాది బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని అమ్మవారి చల్లని చూపుతో తెలంగాణ రాష్ట్రం శాస్య శామలంగా సుభిక్షంగా, ప్రజలందరూ ఆయూ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండేలా అకాంక్షిస్తున్నమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News