Tuesday, December 3, 2024

మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తన 153వ చిత్రాన్ని దర్శకుడు మోహన్‌రాజాతో చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. సోమవారం నుండి ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు మోహన్‌రాజా, తమన్ కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక చిరంజీవి మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు మోహన్‌రాజా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ను ఈ సినిమాలో జోడిస్తున్నారు. ఈ విషయంలో చిరంజీవి కూడా సంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకాలపై ఆర్.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ పూర్తికాగానే ఈ చిత్రం పట్టాలెక్కనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News