Thursday, May 16, 2024

మరో వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

Tamanna gives green signal to another web series

 

హీరోయిన్స్ ఎక్కువ కాలం పాటు స్టార్స్‌గా కొనసాగలేరు. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా కూడా కొంత కాలం తర్వాత ఫేడ్ ఔట్ కావాల్సిందే. కొందరు హీరోయిన్స్‌కు స్టార్ డమ్ తగ్గి ఆఫర్లు తగ్గితే కనిపించకుండా పోతారు. కానీ కొందరు మాత్రం సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టి రాణిస్తారు. ఇక తమన్నా స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌ను షురూ చేసిందనిపిస్త్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్స్ తో పాటు ఇతర భాషల స్టార్స్‌తో కూడా ఆడి పాడిన తమన్నా ఇప్పుడు మాత్రం లేడీ ఓరియంటెడ్ చిత్రాలు.. క్యారెక్టర్ ఆర్టిస్టు రోల్స్‌ను చేస్తోంది. ఇటీవల ఆమె రెండు వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్‌లో ఏ స్టార్ హీరోయిన్ చూపించినంత జోరును ఓటీటీలో ఆమె చూపిస్తోంది. తాజాగా తమన్నా మరో వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెజాన్ వారు నిర్మించబోతున్న ఈ వెబ్ సిరీస్‌తో ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యారీ దోస్తీ అనే టైటిల్‌తో అరుణియ శర్మ దర్శకత్వంలో ఈ వెబ్‌సిరీస్ రూపొందుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఒక వైపు సినిమా ల్లో నటిస్తూ మరో వైపు వెబ్ సిరీస్‌లు చేస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News