Saturday, April 27, 2024

మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలి

- Advertisement -
- Advertisement -

పోలీసులపై-మ హత్య కేసు నమోదు చేయాలి: తమ్మినేని

Tammineni comments on Mariyamma lock up death

మన తెలంగాణ/హై-దరాబాద్: మరియమ్మపై పోలీసుల ప్రవర్తన అమానుషంగా ఉందని, వారు పెట్టిన చిత్రహింసలకే మరియమ్మ మరణించినందున హత్య కేసు(కస్డోడియన్ హత్య)గా పరిగణించి బాధ్యులను అరెస్టు చేయాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. మరియమ్మ ఖమ్మం జిల్లా నుండి వచ్చి యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు మండల కేంద్రంలోని చర్చి ఫాదర్ వద్ద పనిచేస్తూ తన పిల్లలను సాకుతున్నది. చర్చి ఫాదర్ పర్మిషన్‌తోనే మరియమ్మ తన గ్రామానికి వెళ్లింది. ఆ తర్వాత రెండు లక్షల రూపాయలు మరియమ్మ దొంగిలించారని ఫాదర్ కేసు పెట్టడంతో పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు ఆమెను అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు.

అడ్డం వచ్చిన కొడుకును కూడా కొట్టారు. స్పృహ కోల్పోయిన మరియమ్మకు వైద్యం అందించేలోపు భువనగిరి జిల్లా హాస్పిటల్‌లో చనిపోయింది. దీనిపై పోలీసు అధికారులు ప్రాథమిక విచారణ జరిపి ప్రాథమిక విచారణ చేసి ఎస్‌ఐ, కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడంతోనే సరిపోదు. మరియమ్మ పోలీస్ దెబ్బల వల్లే మరణించినందున హత్య కేసుగా నమోదు చేయాలని తమ్మినేని అన్నారు. బాధిత కుటుంబానికి దళితుల హత్య జరిగిన సందర్భంలో ఉన్న పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పోలీస్ ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని తమ్మినేని అన్నారు. పోలీసులపై ప్రజలకు విశ్వాసం కలిగే విధంగా ఉండాలి తప్ప ప్రజా కంటకులుగా మారరాదని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News