Wednesday, May 8, 2024

టీమిండియాను 65 పరుగులకే ఔట్ చేస్తారట

- Advertisement -
- Advertisement -

ప్రపంచకప్-2023 పైనల్ మ్యాచ్ కు రంగం సిద్ధమవుతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా- ఆస్ట్రేలియాల మధ్య ఆదివారం జరిగే ఈ మ్యాచ్ కోసం కోట్లాదిమంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతవరకూ ఓటమి లేకుండా అన్ని మ్యాచ్ లలో గెలిచి ఇండియా పైనల్ కు చేరుకుంది. ఆస్ట్రేలియా మాత్రం రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది.

పిచ్ స్పిన్ కు అనుకూలించేటట్లు ఉంటే, టీమిండియా సిరాజ్ ను పక్కనబెట్టి అశ్విన్ ను రంగంలోకి దించే అవకాశం ఉంది. అంతకుమించి మార్పులు ఉండకపోవచ్చు. శనివారంనాడు కూడా కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్ ను పరిశీలించారు.

ఇదిలాఉంటే, పైనల్ లో ఎవరు గెలుస్తారనే విషయమై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఇక బెట్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి 450 పరుగులు చేస్తుందట. తర్వాత టీమిండియాను 65 పరుగులకే ఆలౌట్ చేసేస్తారట. ఇదీ మార్ష్ జోస్యం.  మార్ష్ సరదాగానే వ్యాఖ్యానించినా, నెటిజన్లు మాత్రం అతన్ని ఓ ఆట ఆడుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News