Monday, April 29, 2024

యువ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ నిశ్చితార్థం..

- Advertisement -
- Advertisement -

Team India All Rounder Vijay Shankar gets engaged

చెన్నై: టీమిండియా యువ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని శంకర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ సందర్భంగా తన కాబోయే భార్య వైశాలి వీశ్వేశ్వరన్‌తో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంగర ఎమోజీని జత చేశాడు. కిందటి వరల్డ్‌కప్‌లో విజయ్ శంకర్ టీమిండియాలో చోటు సంపాదించాడు. శంకర్ 12 వన్డేలు, మరో తొమ్మిది ట్వంటీ20 మ్యాచుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు.ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ద్వారా ఆరంగేట్రం చేశాడు. కాగా, శంకర్ నిశ్చితార్థం విషయాన్ని తెలుసుకున్న సహచక క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ పోస్ట్‌పై స్పందించిన కెఎల్ రాహుల్, చాహల్ అభినందనలు సోదరా అంటూ అభినందించారు. కాగా, శంకర్ ప్రస్తుతం ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు ఉపయుక్తమైన బ్యాట్స్‌మన్‌గా శంకర్ పేరు తెచ్చుకున్నాడు.

Team India All Rounder Vijay Shankar gets engaged

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News